Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే కొంతమంది స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేసే సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకొని ప్రేక్షకులందని తమ అభిమానులుగా మార్చుకుంటారు. అప్పటినుంచి వాళ్ళు చేసే సినిమాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన హైపును పెంచుతూ భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టే రీతిలో ముందుకు సాగుతూ ఉంటారు… ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా అవతరించిన రామ్ చరణ్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో ‘పెద్ది’ సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఈ మూవీ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందే ‘రంగస్థలం’ సినిమా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించిన విషయం మనకు తెలిసిందే. నిజానికి రంగస్థలం సినిమా వచ్చే ముందు వరకు రామ్ చరణ్ నటన మీద చాలా విమర్శలైతే వచ్చేవి. కానీ రంగస్థలం ఎప్పుడైతే వచ్చిందో దాంట్లో రామ్ చరణ్ తన పూర్తిస్థాయి నటనను చూపించి ప్రతి ఒక్కరిని మెప్పించాడు. దాంతో అతన్ని విమర్శించే వాళ్ళే ప్రశంసించే స్థాయికి వెళ్లిపోయాడు.
అలాంటి రామ్ చరణ్ ఇప్పుడు సుకుమార్ తో చేస్తున్న సినిమా స్టోరీ ఎలా ఉండబోతోంది అనే ఒక క్యూరియాసిటి ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో ఉంది. కానీ ఈ సినిమా నిర్మాత అయిన మైత్రి మూవీ మేకర్స్ ‘రవి యలమంచిలి’ రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఒక హింట్ ఇచ్చాడు…
ఇంతకీ ఆయన ఇచ్చిన క్లూ ఏంటంటే రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా స్టోరీ చాలా ఫ్రెష్ గా ఉంటుందని గత సినిమాల మాదిరిగా ఈ సినిమా ఉండబోదని గతంలో సుకుమార్ పిరియాడికల్ డ్రామా సినిమాలను తెరకెక్కించారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా సమకాలీన స్టోరీతో ఉంటుందని చెప్పడంతో ఈ మూవీలో రామ్ చరణ్ చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నాడని ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు.
ఎందుకంటే సుకుమార్ ఈతరం స్టోరీల్లో హీరోలను చాలా స్టైలిష్ గా చూపించడంలో సుకుమార్ దిట్ట…’వన్ నేనొక్కడినే’ సినిమాతో మహేష్ బాబుని చాలా స్టైలిష్ గా చూపించాడు. అలాగే నాన్నకు ప్రేమతో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ను సైతం తన కెరియర్ లో చూడనటువంటి ఒక డిఫరెంట్ మెకోవర్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అది ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ సైతం అదే రీతిలో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది…