https://oktelugu.com/

Pushpa 2: పుష్ప 2 మూవీ ట్రైలర్ కోసం టెన్షన్ పడుతున్న సుకుమార్…కారణం ఏంటంటే..?

అల్లు అర్జున్ సుకుమార్ మధ్య మంచి బాండింగ్ ఉందనే విషయం మనకు తెలిసిందే. ఇక ఆర్య సినిమా నుంచి మొదలైన వీళ్ళ ప్రస్థానం ఆర్య 2, పుష్ప ప్రస్తుతం పుష్ప 2 వరకు కొనసాగుతుందనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : September 12, 2024 / 12:59 PM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా భారీ సక్సెస్ ని సాధించి 1500 కోట్ల వరకు కలెక్షన్లు రాబడుతుందనే నమ్మకంతో అల్లు అర్జున్ అయితే ఉన్నాడు. ఇక పుష్ప మొదటి పార్టు తెలుగులో పెద్దగా మెప్పించకపోయినప్పటికీ, బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమాకి అక్కడి జనాలు బ్రహ్మరథం పట్టారనే చెప్పాలి. అలాంటి పుష్ప సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ‘పుష్ప 2’ సినిమా మీద అక్కడ విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే అల్లు అర్జున్ స్టైల్ గాని, ఆయన గెటప్ గాని సగటు ప్రేక్షకుడిని చాలా వరకు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇక ఐకాన్ స్టార్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మాత్రం పుష్ప 2 సినిమాతో ఎలాగైనా సరే ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఈ సినిమా డిసెంబర్ 6 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన మొదటి ట్రైలర్ ని రిలీజ్ చేయాలని సుకుమార్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికోసమే ట్రైలర్ ని ఎక్కడనుంచి కట్ చేయాలి ఎలా ప్రేక్షకుడు మెచ్చే విధంగా ట్రైలర్ ని రూపొందించాలి అనే దాని మీదనే సుకుమార్ చాలావరకు సందిగ్ధ పరిస్థితిలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే ఇప్పుడు డిసెంబర్ 6 వ తేదీన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలావరకు ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

    ఎందుకంటే ఈ డేట్ కనక పోస్ట్ పోన్ అయితే మాత్రం పుష్ప 2 సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మొత్తం పోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అందుకే ఈ సినిమాని అనుకున్న డేట్ కి వచ్చే విధంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని చేయడానికి ఆయన తీవ్రమైన సన్నాహాలు చేస్తున్నాడు. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది… పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ ఎంతలా కష్టపడుతున్నాడు అంటే దాదాపు ఈ సినిమా మీదనే ఆయన తీవ్రమైన కృషి చేసినట్టుగా తెలుస్తోంది.

    ఇక తన షూటింగ్ పార్ట్ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కూడా సినిమాకి ఏం కావాలో అది ఇవ్వడానికి ఆయన వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ ఈ సినిమాతో మరొక మెట్టు పైకి ఎక్కాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…