https://oktelugu.com/

Bigg Boss Telugu 8: టాస్కులో కొట్లాట.. నిఖిల్, పృథ్వీరాజ్ మధ్య ముదిరిన వివాదం.. చివరికి గెలిచింది ఎవరంటే!

సీజన్ చాలా స్లో గా వెళ్తుంది, సీజన్ 6 కంటే పెద్ద డిజాస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అనిపించింది. కానీ ఈరోజు కాసేపటి క్రితమే విడుదల చేసిన ప్రోమో లో అసలు సిసలు టాస్కులు ఈరోజు నుండే మొదలు కాబోతున్నాయి అనేది అర్థమైంది.

Written By:
  • Vicky
  • , Updated On : September 12, 2024 / 01:03 PM IST

    Bigg Boss Telugu 8(9)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు ఇప్పటి నుండే జటిలం అవుతున్నాయి. సాధారణంగా టాస్కులు గత సీజన్స్ లో నాలుగు వారాలు తర్వాత కఠినంగా మారేవి, కానీ ఇది అన్ లిమిటెడ్ సీజన్ కాబట్టి ఇప్పటి నుండే మొదలైంది. గత రెండు మూడు రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో గొడవలు, సంభాషణలు తప్ప ఏమి లేవు, సీజన్ చాలా స్లో గా వెళ్తుంది, సీజన్ 6 కంటే పెద్ద డిజాస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అనిపించింది. కానీ ఈరోజు కాసేపటి క్రితమే విడుదల చేసిన ప్రోమో లో అసలు సిసలు టాస్కులు ఈరోజు నుండే మొదలు కాబోతున్నాయి అనేది అర్థమైంది. ఈ సీజన్ గత సీజన్స్ లాగా కాకుండా, ప్రైజ్ మనీ ఇంతే అని చెప్పలేదు బిగ్ బాస్. అనంతమైన డబ్బుని టాస్కుల ద్వారా గెలుచుకొని దానిని ప్రైజ్ మనీ గా పొందే అవకాశం అన్నమాట.

    అందుకు సంబంధించిన టాస్కుని నేడు బిగ్ బాస్ పెట్టాడు. ముందుగా LED టీవీ లో మణికంఠ, విష్ణు ప్రియా మరియు సోనియా స్విమ్మింగ్ పూల్ లో దూకమని అంటాడు బిగ్ బాస్. మణికంఠ, విష్ణు దూకేస్తారు కానీ సోనియా మధ్యలో పడిపోతుంది. ఆమె మధ్యలో పడిపోయిందని ఏడుస్తుంటే పృథ్వీ రాజ్ దగ్గరకు తీసుకొని ఓదారుస్తాడు. ఇక ఆ తర్వాత నిఖిల్ పృథ్వీ తో మాట్లాడుతూ మణికంఠ స్థానం లో నేను వచ్చి ఉండుంటే రఫ్ గా ఆడేవాడిని, ఆ సమయంలో నీకు దెబ్బలు తగలొచ్చు, నాకు దెబ్బలు తగలొచ్చు, మనం ఆర్టిస్టులం, తలకు దెబ్బ తగిలితే ఎవరిదీ రా బాధ్యత అని అంటాడు. ఇక ఆ తర్వాత యష్మీ మరియు నిఖిల్ మధ్య చిన్న వాగ్వివాదం జరుగుతుంది. ఇక ఆ తర్వాత LED టీవీ లో నబీల్, నిఖిల్ మరియు పృథ్వీ రాజ్ పేర్లను చూపిస్తాడు బిగ్ బాస్. ముగ్గురు తాడుని వదలకుండా, బాక్సులలో బాల్స్ ఎక్కువగా వేసిన వారు టాస్కు గెలుస్తారని బిగ్ బాస్ అంటాడు. ఈ టాస్కులో ముగ్గురు హోరాహోరీగా తలపడుతారు. కానీ మధ్యలో నవీన్ తాడుని వదిలేస్తాడు. ఇక నిఖిల్, పృథ్వీ మధ్య నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ నడుస్తుంది.

    చివరికి ఈ టాస్కులో నిఖిల్ గెలుస్తాడు. ఈ టాస్కు ఆడుతున్న క్రమం లో అసలు వీళ్లిద్దరు టాస్కు ఆడుతున్నారా, లేదా ఒకరిని ఒకరు కొట్టుకుంటున్నారా అనే అనుమానం కలుగుతుంది. ఆ స్థాయిలో వీళ్లిద్దరు పోటీ పడుతారు. ఇన్ని రోజులు ప్రేక్షకులు టాస్కులు ఈ స్థాయిలో ఉండాలని మాత్రమే కోరుకున్నారు. మొత్తానికి ఆ లైన్ లోనే బిగ్ బాస్ షో వచ్చేసింది. రాబోయే రోజుల్లో ఇదే విధమైన టాస్కులు ఉంటాయో లేదో చూడాలి. నిఖిల్ మంచి గేమర్ అనేది ఈ టాస్కు తో మరోసారి రుజువు అయ్యింది కానీ, ఆయన ఎక్కువ ఎమోషన్స్ కి గురి అవుతున్నాడు, అది తగ్గిస్తే టైటిల్ రేసులో ఉన్న కంటెస్టెంట్ గా నిఖిల్ ని చూడొచ్చు.