https://oktelugu.com/

Pushpa 2: ప్రీమియర్ షోస్ పడకముందే ‘కల్కి’ రికార్డ్స్ అవుట్..’పుష్ప 2′ ఓవరాల్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ వసూళ్లు ఎంతో తెలుసా?

కల్కి, బాహుబలి 2 , కేజీఎఫ్ 2 చిత్రాలకు కూడా ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదని, కేవలం పుష్ప 2 విషయంలోనే జరిగిందని అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు ఈ సినిమాకి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చిందట.

Written By:
  • Vicky
  • , Updated On : December 4, 2024 / 08:13 AM IST

    Pushpa 2(18)

    Follow us on

    Pushpa 2: కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘పుష్ప 2 : ది రూల్’ ఎట్టకేలకు మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మేకర్స్ కి ఈ సినిమా మీద విపరీతమైన నమ్మకం ఉండడంతో విడుదలకు ముందురోజే ప్రీమియర్స్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసే సాహసం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ టికెట్ రేట్స్ 700 రూపాయలకు పైగానే పెట్టారు. ఇప్పటి వరకు తెలుగు సినిమా హిస్టరీ లో ఒక సినిమా ప్రీమియర్ షోస్ కి ఈ రేంజ్ టికెట్ రేట్స్ పెట్టడం ఇప్పటి వరకు జరగలేదు. ఇకపోతే ఈ సినిమా టికెట్స్ అమ్మకాలలో ఆల్ టైం ఇండియన్ రికార్డుని నెలకొల్పిందని మేకర్స్ అంటున్నారు. వాళ్ళ లెక్క ప్రకారం ఈ సినిమాకి బుక్ మై షో యాప్ లో విడుదలకు ముందే 10 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట. ఇది సాధారమైన విషయం కాదు.

    కల్కి, బాహుబలి 2 , కేజీఎఫ్ 2 చిత్రాలకు కూడా ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదని, కేవలం పుష్ప 2 విషయంలోనే జరిగిందని అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు ఈ సినిమాకి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చిందట. ఇప్పటి రోజుల్లో ఒక స్టార్ హీరో కి వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మొదటిరోజు వస్తేనే ఒక గొప్ప రికార్డుగా భావిస్తారు . అలాంటిది అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చిందంటే ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి అద్భుతాలను సృష్టించబోతుందో ఊహించుకోవచ్చు. విడుదల తర్వాత టాక్ వస్తే ఈ సినిమా కేవలం వీకెండ్ లోనే 700 కోట్ల రూపాయిల గ్రాస్ ని, అలాగే మొదటి వారం లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.

    ఓవరాల్ గా ఫుల్ రన్ లో ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ‘బాహుబలి 2’ 2000 కోట్ల రూపాయిల గ్రాస్ ని అవలీలగా అధిగమించే అవకాశం ఉందని అంటున్నారు. వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని కొట్టడమే పెద్ద అఛీవ్మెంట్ లాగా భావిస్తున్న ఈరోజుల్లో అల్లు అర్జున్ ఏకంగా రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ ని కొట్టే అవకాశం ఉంది అనే టాక్ రావడంతో, ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ప్రివ్యూ షోకి టాక్ అదిరిపోయింది. చాలా కాలం తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించబోతున్న కమర్షియల్ సినిమాగా ‘పుష్ప 2’ ఉండబోతుందని, ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎవ్వరూ అందుకోలేని స్థాయికి పాన్ ఇండియన్ లెవెల్ లో ఎదగబోతున్నాడని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. ఇకపోతే హిందీ లో ఈ చిత్రానికి మొదటి రోజు 80 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందట.