https://oktelugu.com/

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ నచ్చిన అమ్మాయిని వదలడా? రష్మీతో అలా … క్లారిటీ ఇచ్చిన మాజీ జబర్దస్త్ కమెడియన్

సుధీర్ మల్టీ టాలెంటెడ్. వృత్తిరీత్యా సుధీర్ మెజీషియన్. మ్యాజిక్ అద్భుతంగా చేస్తాడు. అలాగే సుధీర్ మంచి డాన్సర్. పాటలు కూడా అద్భుతంగా పాడతాడు. ఇవన్నీ వెరసి సుధీర్ కి లక్షల మంది అభిమానులు ఏర్పడ్డారు.

Written By:
  • S Reddy
  • , Updated On : April 19, 2024 / 01:22 PM IST

    Sudigali Sudheer reacts about jabardasth skits trolling

    Follow us on

    Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ బుల్లితెర సూపర్ స్టార్. ప్రస్తుతం వెండితెర మీద కూడా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. హీరోగా మొదటి హిట్ కొట్టాడు కూడాను. సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన గాలోడు విజయం అందుకుంది. సుడిగాలి సుధీర్ సక్సెస్ వెనుక ఆయన కష్టం చాలా ఉంది. జబర్దస్త్ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి టీమ్ లీడర్ అయ్యాడు. తన మిత్రులు ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులతో కలిసి నాన్ స్టాప్ నవ్వులు పంచాడు.

    సుధీర్ మల్టీ టాలెంటెడ్. వృత్తిరీత్యా సుధీర్ మెజీషియన్. మ్యాజిక్ అద్భుతంగా చేస్తాడు. అలాగే సుధీర్ మంచి డాన్సర్. పాటలు కూడా అద్భుతంగా పాడతాడు. ఇవన్నీ వెరసి సుధీర్ కి లక్షల మంది అభిమానులు ఏర్పడ్డారు. అయితే సుధీర్ కి ఒక బ్యాడ్ నేమ్ ఉంది. అతడిని తోటి కమెడియన్స్ ప్లే బాయ్ అంటారు. నచ్చిన అమ్మాయిని వదలడు. స్త్రీలోలుడు అన్నట్లు మాట్లాడతారు. బుల్లితెర వేదికల మీద అనేక మార్లు సుధీర్ అమ్మాయిల పిచ్చోడు అన్నట్లు కామెంట్స్, సెటైర్స్ వేశారు.

    దీని గురించి నేరుగా సుధీర్ ని అడగ్గా… ఆయన స్పందించారు. వాళ్ళు నా మీద వేసే ప్లే బాయ్ పంచులు కేవలం కామెడీ కోసమే. అందులో ఎలాంటి నిజం లేదు. ఫన్ కోసం నా మీద అలాంటి సెటైర్స్ వేస్తారు. నేను ఇవన్నీ సరదాగా తీసుకుంటాను. నాకు కోపం రాదని సుధీర్ అన్నాడు. అలాగే రష్మీ గౌతమ్ తో రిలేషన్ గురించి కూడా ఓపెన్ అయ్యాడు. వాస్తవంలో మేము మిత్రులం మాత్రమే.

    బుల్లితెర మీద ఎంటర్టైన్మెంట్ కోసం ప్రేమికులుగా కనిపించామని అన్నాడు. సుడిగాలి సుధీర్ ని ఫేమస్ చేసిన అంశాలలో రష్మీ గౌతమ్ తో లవ్ ట్రాక్ కూడా ఒకటి. జబర్దస్త్-ఢీ షోలలో వీరి కెమిస్ట్రీ అదిరింది. సుడిగాలి సుధీర్ బుల్లితెరకు దూరం అయ్యాక ఈ జంటను ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. కాగా సుడిగాలి సుధీర్ ప్రస్తుతం GOAT టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నాడు. ఇటీవల కాలింగ్ సహస్ర తో ప్రేక్షకులను పలకరించాడు.