https://oktelugu.com/

Sudigali Sudheer: జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సుడిగాలి సుధీర్.. దుమ్ములేపున్న ప్రోమో

Sudigali Sudheer: సుమారు 10 ఏళ్ళ నుండి ఈటీవీ లో దిగ్విజయంగా అద్భుతమైన TRP రేటింగ్స్ తో కొనసాగుతున్న షో జబర్దస్త్ కామెడీ షో..మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణ సారథ్యం లో సాగుతున్న ఈ కామెడీ షో ఎంతో మంది కోయండియాన్స్ కి ఊపిరి పోసింది..ఈ షో ద్వారా పరిచయమైనా కమెడియన్స్ అందరూ అశేష ప్రజాధారణ పొంది సినిమాలూ కూడా బిజీ గా గడుపుతున్నారు..ఒకప్పుడు ఈ కామెడీ షో కి దాదాపుగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 23, 2022 / 09:00 AM IST
    Follow us on

    Sudigali Sudheer: సుమారు 10 ఏళ్ళ నుండి ఈటీవీ లో దిగ్విజయంగా అద్భుతమైన TRP రేటింగ్స్ తో కొనసాగుతున్న షో జబర్దస్త్ కామెడీ షో..మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణ సారథ్యం లో సాగుతున్న ఈ కామెడీ షో ఎంతో మంది కోయండియాన్స్ కి ఊపిరి పోసింది..ఈ షో ద్వారా పరిచయమైనా కమెడియన్స్ అందరూ అశేష ప్రజాధారణ పొంది సినిమాలూ కూడా బిజీ గా గడుపుతున్నారు..ఒకప్పుడు ఈ కామెడీ షో కి దాదాపుగా 18 కి పైగా TRP రేటింగ్స్ వచ్చేవి..ఈ రేటింగ్స్ కొన్ని కొత్త సినిమాలకు కూడా రావు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ఈ స్థాయి TRP రేటింగ్స్ రావడానికి ప్రధాన కారణం ఆ షో లో కంటెస్టెంట్స్ గా పాల్గొనే సుడిగాలి సుధీర్ మరియు హైపర్ ఆది వల్లే..జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ షోస్ కి ఆయువుపట్టు లాగ ఉండే ఈ ఇద్దరు ఇటీవలే జబర్దస్త్ షో ని వదిలేయడం తో TRP రేటింగ్స్ దారుణంగా పడిపోయాయ్యి.

    Sudigali Sudheer

    TRP రేటింగ్స్ లో కింగ్ లా కొనసాగిన జబర్దస్త్ షోకి వీళ్లిద్దరు వెళ్ళిపోయాక వన్నె తగ్గింది..ఇప్పుడు ప్రస్తుతం జబర్దస్త్ TRP రేటింగ్స్ 8 నుండి 10 వరుకు ఉంటుంది..దాదాపుగా 10 TRP పాయింట్లు తగ్గినప్పటికీ కూడా ప్రస్తుతం జబర్దస్త్ కి ఉన్నటువంటి ఆ రేంజ్ TRP రేటింగ్స్ కూడా మిగిలిన చానెల్స్ లో మిగిలిన షోస్ కి లేకపోవడం విశేషం..కానీ ఈ షో ని వదిలి వెళ్లిపోయిన సుడిగాలి సుధీర్ మళ్ళీ తిరిగి జబర్దస్త్ షో లో పాల్గొనబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..సుధీర్ గతం లో శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి మన అందరికి తెలిసిందే.

    Also Read: Colour Photo: ‘కలర్‌ ఫోటో’కి జాతీయ అవార్డు రావడానికి కారణాలు ఇవే

    Sudigali Sudheer

    ఆ తర్వాత ఆయన ఈటీవీ నుండి వెళ్లిపోయిన తర్వాత ఆ షో కి వ్యాఖ్యాతగా యాంకర్ రష్మీ వ్యవహరిస్తోంది..ప్రతి ఆదివారం లాగానే ఈ ఆదివారం కూడా ప్రసారం అవ్వబోతున్న ఈ షో లో రష్మీ కి సుధీర్ పంపిన ప్రత్యేక వీడియో బైట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఈ బైట్ లో సుధీర్ మాట్లాడిన మాటలను మ్యూట్ చేసారు..ఇంతకీ ఆ బైట్ లో ఆయన ఏమి మాట్లాడాడు ఏమిటి అనేది తెలుసుకోవాలని సుధీర్ అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు..ఇది కచ్చితంగా సుధీర్ రీ ఎంట్రీ కి సంబంధించిన వీడియోనే అని..ఇక పై మళ్ళీ సుధీర్ ని ఈటీవీ షోస్ లో చూడొచ్చు అని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు..మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలంటే మరో ఆదివారం వరుకు ఆగాల్సిందే.

    Also Read:The Warrior Collections: ‘ది వారియర్’10 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు నష్టం అంటే ?

    Tags