https://oktelugu.com/

Dhee Show: ఢీ షో లో రగడ..హైపర్ ఆది పై చెయ్యి చేసుకోబోయిన కంటెస్టెంట్..వైరల్ అవుతున్న వీడియో

Dhee Show: ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీషో కి ఎలాంటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకముగా చెప్పనక్కర్లేదు..ప్రతి బుధవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ప్రసారం అయ్యే ఈ డాన్స్ షో ఇప్పటికి 15 సీసన్స్ పూర్తి చేసుకుంది..ఈ షో ద్వారా ఇండస్ట్రీ కి వచ్చిన శేఖర్ మాస్టర్ మరియు జానీ మాస్టర్ వంటి వారు ఇప్పుడు సౌత్ ఇండియా లో ఎంత పెద్ద కొరియోగ్రాఫర్స్ గా కొనసాగుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రతి స్టార్ హీరో సినిమాకి వీళ్లిద్దరు […]

Written By: , Updated On : July 23, 2022 / 09:15 AM IST
Follow us on

Dhee Show: ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీషో కి ఎలాంటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకముగా చెప్పనక్కర్లేదు..ప్రతి బుధవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ప్రసారం అయ్యే ఈ డాన్స్ షో ఇప్పటికి 15 సీసన్స్ పూర్తి చేసుకుంది..ఈ షో ద్వారా ఇండస్ట్రీ కి వచ్చిన శేఖర్ మాస్టర్ మరియు జానీ మాస్టర్ వంటి వారు ఇప్పుడు సౌత్ ఇండియా లో ఎంత పెద్ద కొరియోగ్రాఫర్స్ గా కొనసాగుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రతి స్టార్ హీరో సినిమాకి వీళ్లిద్దరు ఉండడం చాలా కామన్ అయిపోయింది..ఇక షో ద్వారానే ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి కూడా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది..ఇలా ఎంతో మందికి గొప్ప జీవితం ని ఇచ్చింది ఈ షో..అయితే అప్పుడప్పుడు TRP రేటింగ్స్ కోసం ఈ షో ని నిర్వహించే డైరెక్టర్ కొన్ని కాంట్రవర్సీలు సృష్టిస్తూ ఉంటారు..అప్పట్లో ఢీ షో లో కూడా టీం లీడర్స్ గా ఉన్న సుధీర్ మరియు రష్మీ మధ్య ఇలాగె గొడవలు జరిగాయి..అయితే ఇది స్క్రిప్టెడ్ కాదని..ఆ సమయం లో నిజంగా ఆ ఇద్దరికీ కోపం వచ్చిందని అంటుంటారు..అయితే ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ ఎవ్వరు కనుక్కోలేరు.

Dhee Show

dhee show latest promo

చాలా కాలం తర్వాత సరిగ్గా ఇప్పుడు అలాంటి వివాదాస్పద ప్రోమో ని వదిలింది మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్..ఇప్పుడు ఈ వీడియో మొత్తం సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..ఈ షో కి ప్రస్తుతం శ్రద్ద దాస్ ,గణేష్ మాస్టర్ మరియు నందిత దాస్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తుండగా హైపర్ ఆది, రవి మరియు నవ్య స్వామి టీం లీడర్స్ గా వ్యవహరిస్తున్నారు..యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు..అయితే లేటెస్ట్ గా ఇప్పుడు వదిలిన ప్రోమో లో ఒక కంటెన్స్టెంట్ అద్భుతంగా డాన్స్ వేసే లోపు శ్రద్ద స్టేజి మీదకి వచ్చి ఆ కంటెస్టెంట్స్ ని ప్రోత్సహించింది.

Also Read: Sudigali Sudheer: జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సుడిగాలి సుధీర్.. దుమ్ములేపున్న ప్రోమో

dhee show

dhee show latest promo

ఇది చూసిన మరో కంటెస్టెంట్ శ్రద్ద దాస్ ని నిలదీస్తూ మేము కూడా అద్భుతంగా డాన్స్ వేసాము..మమల్ని ఎందుకు ఇలా ప్రోత్సహించలేదు..మేము ఏమి పాపం చేసాము అంటూ శ్రద్ద దాస్ ని నిలదీసాడు..అప్పుడు యాంకర్ ప్రదీప్ మీరు సెన్స్ లెస్ గా మాట్లాడకండి అని మధ్యలో చొరవ తీసుకున్నాడు..అలా ఈ ముగ్గురు మధ్య వివాదం చాలా హాట్ గా జరుగుతున్నా సమయం లో హైపర్ ఆది వస్తాడు..అప్పుడు హైపర్ ఆది ని ‘నీ కామెడీ నా దగ్గర చెయ్యకు..పగిలిపోతాది’ అంటూ వార్నింగ్ ఇస్తాడు ఆ కంటెస్టెంట్..ఆద్యంతం వివాదాస్పదం గా మారబోతున్న ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆత్రుతో ఎదురు చూస్తున్నారు.

Also Read:68th National Film Awards: జాతీయ అవార్డుల విజేతలు వీరే.. సత్తా చాటిన తెలుగు సినిమాలు

 

Tags