Sudigali Sudheer: బుల్లితెర సూపర్ స్టార్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ కామెడీ షోతో వెలుగులోకి వచ్చిన సుధీర్… ఢీ డాన్స్ రియాలిటీ షోతో మరింత పాప్యులర్ అయ్యాడు. డాన్స్, సింగింగ్, మ్యాజిక్ షోలతో మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు. వేదికలపై తన ప్రతిభ ప్రదర్శిస్తూ సుధీర్ అంతకంతకూ తన ఇమేజ్ పెంచుకుంటూ పోయాడు. ప్రస్తుతం ఆయన హీరోగా సినిమాలు చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో సుధీర్ హీరోగా నటించారు. గాలోడు, కాలింగ్ సహస్త్ర టైటిల్ తో మరో రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.

ఒక ప్రక్క హీరోగా చేస్తూనే ఇతర హీరోల చిత్రాల్లో సుధీర్ కామెడీ రోల్స్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సుధీర్ కెరీర్ మూడు పూలు ఆరు కాయలన్నట్లు సాగుతుంది. కాగా సుధీర్ ప్రస్తుత వయసు 35 సంవత్సరాలు. అయినప్పటికీ ఆయన పెళ్లి మాట ఎత్తడం లేదు. సుధీర్ బెస్ట్ ఫ్రెండ్స్ గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ పెళ్లి చేసుకొని ఇద్దరిద్దరు పిల్లల్ని కూడా కన్నారు. మరి సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం తెలియడం లేదు.
అయితే తాజాగా ఓ షాకింగ్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది . దాని ప్రకారం సుధీర్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారట. ఈ కారణంతోనే సుధీర్ పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదట. టెలివిజన్ షోస్ కూడా ఆయన తగ్గించడానికి అసలు రీజన్ ఇదేనట. సుధీర్ గతంలో జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో చేసేవారు. సదరు షోస్ ని ఒక్కొక్కటిగా వదిలేస్తూ వచ్చాడు. మొదట ఢీ నుండి బయటికొచ్చిన సుధీర్… నెక్స్ట్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ నుండి తప్పుకున్నాడు.

మల్లెమాల వాళ్లతో విబేధాలు, రెమ్యూనరేషన్, సినిమా ఆఫర్స్ కారణంగా సుధీర్ పాప్యులర్ టెలివిజన్ షోస్ వదిలేశారని అందరూ భావించారు. నిజానికి ఆరోగ్య కారణాలతోనే సుధీర్ వాటిని పక్కన పెట్టారనేది తాజా వార్త. మొన్నటి వరకు సుధీర్ స్టార్ మాలో సూపర్ సింగర్ జూనియర్ షో యాంకర్ గా చేశారు. ఇటీవల ఆ షో ముగిసింది. దీంతో సుధీర్ బుల్లితెరకు పూర్తిగా దూరమయ్యాడు. ఆయన గతంలో చేసిన షోస్ లో మాత్రమే కనిపిస్తున్నారు. కొత్తగా ఒక్క షో కూడా సుధీర్ చేయడం లేదు. ఇక సుధీర్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. కాగా చాలా కాలంగా సుధీర్-రష్మీ మధ్య సంథింగ్ సంథింగ్ అన్న ప్రచారం ఉంది. రష్మీ వయసు 34 కాగా ఆమె కూడా పెళ్లి మాటెత్తడం లేదు.