https://oktelugu.com/

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్… బుల్లితెరను దున్నేయడానికి సిద్ధం!

తాజాగా సుడిగాలి సుధీర్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుధీర్ తనకు లైఫ్ ఇచ్చిన ఈటీవీలో ఓ సరికొత్త షో ఒకే చేశాడు. త్వరలో బుల్లితెరపై గ్రాండ్ గా రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

Written By: , Updated On : May 16, 2024 / 05:18 PM IST
Sudigali Sudheer grand re-entry on the silver screen

Sudigali Sudheer grand re-entry on the silver screen

Follow us on

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కొంతకాలంగా బుల్లితెరకు దూరమైన సంగతి తెలిసిందే. హీరోగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. ఇప్పటివరకు ఆయన సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు, పండుగాడు, కాలింగ్ సహస్ర వంటి సినిమాలు చేశాడు. సుడిగాలి సుధీర్ కి మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో నిర్మాతలు సైతం సినిమాలు నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ప్రస్తుతం గోట్ అనే మూవీలో నటిస్తున్నాడు. అయితే తాజాగా సుడిగాలి సుధీర్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సుధీర్ తనకు లైఫ్ ఇచ్చిన ఈటీవీలో ఓ సరికొత్త షో ఒకే చేశాడు. త్వరలో బుల్లితెరపై గ్రాండ్ గా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఫ్యామిలీ స్టార్స్ అనే షో తో మళ్లీ బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. మాస్ ఎంట్రీ ఇచ్చాడు సుధీర్. ఆట చూస్తావా .. అంటూ మహేష్ బాబు డైలాగ్ తో దుమ్మురేపాడు. ప్రస్తుతం ఈ ప్రోమోకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ముఖ్యంగా సుధీర్ ఫ్యాన్స్ కామెంట్ల మోతమోగిస్తున్నారు.

మరోవైపు సుడిగాలి సుధీర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుడిగాలి సుధీర్ యాంకర్ గా రీఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సుధీర్ ‘ గోట్ ‘ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల మూవీ రిలీజ్ ఆగిపోయినట్లు తెలుస్తుంది. దీంతో సినిమాను పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. కొన్ని ఆఫర్స్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితులు బాగా లేకపోవడంతో ఇంకా పట్టాలెక్కడం లేదని సమాచారం.

ఈ గ్యాప్ లో ఖాళీగా ఉండటం ఎందుకని భావించి సుధీర్ మళ్లీ టీవీ షోస్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. సుధీర్ హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా లో రెండు షోలు హోస్ట్ చేస్తున్నాడు. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ తో పాటు సర్కార్ సీజన్ 4 చేస్తున్నాడు.