Gaalodu Collections: సుడిగాలి సుధీర్ సుడి మాములుగా లేదు..జబర్దస్త్ కామెడీ షో మొదలుగొని ఈటీవీ లో ప్రసారమయ్యే అన్నీ ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా తన కామెడీ టైమింగ్ తో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సుధీర్ హీరోగా కూడా సక్సెస్ అయిపోయాడు.. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ ‘గాలోడు’ అదిరిపోయ్యే ఓపెనింగ్ వచ్చింది.. టీజర్ మరియు ట్రైలర్ తో ఇంత నాశిరకంగా ఉందేంటి.. సుధీర్ కి సినిమాలు అవసరమా! అనే కామెంట్స్ అప్పట్లో బలంగా వినిపించ్చాయి.. కానీ అదే టీజర్ మరియు ట్రైలర్ తో సుధీర్ ఇలాంటి ఓపెనింగ్ కలెక్షన్స్ ని కోళ్లగొడుతాడని బహుశా సుధీర్ కూడా ఊహించి ఉండదు..తన క్రేజ్ కేవలం బుల్లి తెరకి మాత్రమే పరిమితం కాదు.. వెండితేరా ఆడియన్స్ ని కూడా రప్పించగలను అని సుధీర్ ఈ సినిమాతో నిరూపించాడు..రెండు కోట్ల 50 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం మూడు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే మొదటి రోజు కోటి 21 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.. వచ్చిన టాక్ కి నాశిరకపు ప్రొమోషనల్ కంటెంట్ కి ఈ స్థాయి వసూళ్లు వచ్చాయంటే అది కేవలం సుధీర్ క్రేజ్ వల్లే అని చెప్పొచ్చు..ఇక రెండవ రోజు కూడా దాదాపుగా అదే స్థాయి వసూళ్లను రాబట్టింది..మొదటి రోజు కంటే కేవలం 7 లక్షల రూపాయిలు తక్కువగా కోటి 14 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.. ఇక మూడవ రోజు ఆదివారం కావడం తో మొదటి రెండు రోజులకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి ఏకంగా కోటి 61 లక్షల రూపాయిల గ్రాస్ ని కోళ్లగొట్టొంది.

మొత్తానికి మూడు రోజులకు కలిపి 4 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు 2 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసి బ్రేక్ ఈవెన్ మార్కుకి అడుగు దూరం లో ఉంది.. ఈరోజు మరియు రేపటి లోపు బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా దాటేసి లాభాల్లోకి అడుగుపెట్టబోతుంది.. ఒక బిలో ఎవరేజి సినిమా కేవలం సుధీర్ క్రేజ్ తో హిట్ అయిపోవడం అంటే మాములు విషయం కాదు.. సుధీర్ మంచి క్వాలిటీ సినిమాలు ఎంచుకొని సరైన స్క్రిప్ట్ తో ఒక సినిమాలు చేస్తే కచ్చితంగా 20 కోట్ల రూపాయిల షేర్ రేంజ్ వసూలు చేసే హీరోల జాబితా లో చేరిపోతాడని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.