karthika masam pooja కార్తీక మాసం అంటే శివుడికి ఎంతో ఇష్టం. దీంతో ఈ మాసంలో ఎంతో నిష్టగా పూజలు చేస్తారు. దేవుడిని కొలుస్తారు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శివాలయానికి వెళ్లి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసంగా చెబుతారు. ప్రతి ఇంట్లో మహిళలు పూజలు చేసి తమ ఇష్ట దైవాన్ని కొలవడం మామూలే. ఈ నేపథ్యంలో కార్తీక మాస పూజలకు ప్రాధాన్యం ఏర్పడింది. కార్తీక మాసంలో దీపారాధన ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. అందుకే దీపాలు వెలిగించి తమ మనసులో దైవాన్ని స్మరించుకుంటారు.

కార్తీక మాసం ప్రారంభంలోనే అయ్యప్ప భక్తులు మాలలు వేసుకుంటారు. నల్లని వస్త్రాలు ధరించి నియమ నిష్టలతో దేవుడిని వేడుకుంటారు. మెడలో పూలదండలు, విబూది పూసుకుని నిత్యం దీక్షలు చేస్తుంటారు. మండల దీక్ష, అర్థమండల దీక్ష పేరుతో తెల్లవారు జామునే స్నానమాచరించి మంత్రాలు జపిస్తూ పూజలు నిర్వహిస్తారు. అయ్యప్ప దీక్షలో ఉన్న వారు మూడు పూటల తలంటు స్నానం చేస్తారు. మహిళలు, యువతులు, వృద్ధులు అయ్యప్ప మాల ధరించరు.
మధ్యాహ్నం పూటే భిక్ష చేస్తారు. రెండు పూటల ఉపవాసమే. కొందరు ప్రత్యేకంగా అయ్యప్ప స్వాములు బిక్ష ఏర్పాటు చేస్తుంటారు. 41 రోజులు ఉల్లిపాయ, కారం, మసాలా, ఉప్పు వంటి వాటికి దూరంగా ఉంటారు. 41 రోజుల తరువాత అయ్యప్ప కొండకు వెళ్లి విరుముడి వేస్తారు. మాల సమయంలో భక్తి కార్యక్రమాలతోపాటు పుణ్య కార్యక్రమాలు చేస్తుంటారు. అయ్యప్ప భక్తులు చేసే పడిపూజ అందరికి తెలుసు. స్వాములందరు కలిసి చేసే పూజ కావడంతో అరటి బోదెలు, డొప్పలతో అయ్యప్ప కొండ నిర్మిస్తారు. 18 మెట్లు ఉండేలా అలంకరణ చేసి మూడు గంటలకు పైగా పూజ చేస్తారు. మంత్రాలు, అయ్యప్ప నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగుతుంది.

ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. భక్తులు తన్మయం పొందుతారు. అయ్యప్ప నామస్మరణతో తరిస్తారు. ప్రతి భక్తుడు అయ్యప్ప పేరును జపించి ఎంతో పుణ్యం సంపాదించుకుంటాడు. అయ్యప్ప స్వాములకు పడిపూజ కంటే విశిష్టమైన పూజ ఉండదు. అందుకే దీన్ని నియమ నిష్టలతో చేస్తారు. ప్రతి భక్తులు హాజరయి అయ్యప్పను తలుచుకుంటూ భజన చేస్తుంటారు. అయ్యప్ప పూజలో భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని తమ కోరికలు తీర్చాలని వేడుకోవడం సహజమే.