Sudigali Sudheer: బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ అంటే తెలియనివారుండరు. జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన సుధీర్, స్టార్ యాంకర్ గా ఆపై హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం అనేక బుల్లితెర షోలలో యాంకర్ గా అలరిస్తున్న సుధీర్, హీరోగా పలు చిత్రాలు చేస్తున్నారు. కాగా తనకు ఎంతో గుర్తింపు తెచ్చిన జబర్దస్త్, ఢీ షోలకు సుధీర్ దూరమయ్యాడు. సుడిగాలి సుధీర్ టీమ్ లో ప్రస్తుతం ఆటో రామ్ ప్రసాద్ మాత్రమే మిగిలాడు. కమెడియన్ గా వెండితెరపై బిజీ అయిన గెటప్ శ్రీను కూడా జబర్దస్త్ మానేశారు. వీరిద్దరూ లేని సుడిగాలి సుధీర్ టీమ్ కళ కోల్పోయింది.
మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సుధీర్ ని దూరం పెట్టినట్లు తెలుస్తుంది. మొదట ఆయన్ని ఢీ 14 యాంకర్ గా తప్పించారు. తర్వాత జబర్దస్త్ కి దూరమయ్యాడు. అదే సంస్థ నిర్మిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి కూడా సుధీర్ వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్స్ లో సుధీర్ కనిపించడం లేదు. అతడు మెల్లగా స్టార్ మా కి షిఫ్ట్ అయ్యాడు. అనసూయతో పాటు జూనియర్స్ సింగింగ్ షో యాంకర్ గా చేస్తున్నారు. సింగర్ చిత్ర, మను ఈ షోకి జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read: Sneha Ullal: స్నేహ ఉల్లాల్ నటనకు ఎందుకు దూరమైందో తెలుసా?
హీరోగా సినిమాలు చేస్తున్న సుడిగాలి సుధీర్ కెరీర్ కి ఇక ఢోకా లేదు. అతడిప్పుడు కోట్లు సంపాదించే సెలెబ్రెటీ గా ఎదిగాడు. గాలోడు, కాలింగ్ సహస్ర అనే చిత్రాల్లో హీరోగా చేస్తున్నాడు. అదే సమయంలో ఇతర హీరోల చిత్రాల్లో కామెడీ రోల్స్ చేస్తున్నారు. సుధీర్ హీరోగా సక్సెస్ అయితే.. ఆయన రేంజ్ మరో స్థాయికి వెళుతుంది. ఇక 30 ప్లస్ లో ఉన్న సుధీర్ పెళ్లిపై తరచుగా వార్తలు వస్తూ ఉంటాయి. తన బెస్ట్ ఫ్రెండ్స్ గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కూడా కన్నారు. సుధీర్ మాత్రం ఇంకా ఒంటరిగానే ఉన్నారు.
అయితే పెళ్లికి ముందే సుధీర్ నాన్న పోస్ట్ కొట్టేశాడు. అతడు పెదనాన్న అయ్యాడు. సుధీర్ తమ్ముడు రోహన్ కి అన్న సుధీర్ కంటే ముందు పెళ్లైంది.రోహన్ భార్య గర్భవతి కాగా, ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో సుధీర్ ఇంటిలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక సుధీర్ పెదనాన్న అయ్యాడంటూ ఫ్రెండ్స్, సన్నిహితులు విషెస్ తెలియజేస్తున్నారు. అదే సమయంలో నువ్వు కూడా పెళ్లి చేసుకో అని సలహా ఇస్తున్నారట.
కాగా రష్మీ-సుధీర్ మధ్య లవ్ ఎఫైర్ ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం అవుతుంది. వారిద్దరూ ఈ విషయాన్ని ఖండించారు. వారి స్నేహితులు కూడా రష్మీ-సుధీర్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతూ ఉంటారు. జస్ట్ కెరీర్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం బుల్లితెరపై అలా కనిపిస్తారంటూ ఉంటారు. అయితే ఇద్దరూ పెళ్లంటే అప్పుడేనా అంటున్నారు. ఈ క్రమంలో వారి మధ్య ఏం లేదనే వాదనను కొట్టిపారేయలేం అంటున్నారు కొందరు.
Also Read:Sonali Bendre: అద్దె కట్టలేని సోనాలి బింద్రే అలాంటి సినిమాలు చేసిందా?
Recommended Videos