Sudigaali Sudheer: బుల్లితెర పై జబర్దస్త్ కామెడీ షో తో కమెడియన్ గా సూపర్ స్టార్ డమ్ ని సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు ఈటీవీ లో ప్రతీ ఎంటర్టైన్మెంట్ షోలో కనిపిస్తూ ఉండే సుధీర్, ఆ తర్వాత సినిమాల్లో హీరో గా బిజీ అయ్యాడు. రెండు మూడు సినిమాలు యావరేజ్ రేంజ్ లో ఆడినప్పటికీ, సుధీర్ కి వెండితెర పై రావాల్సిన బ్రేక్ ఇప్పటి వరకు రాలేదనే చెప్పాలి. అయితే చాలా రోజుల క్రితమే ఆయన ‘ది గోట్ ‘ అనే చిత్రాన్ని పూర్తి చేసాడు. ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా , కొన్ని అంతర్గత సమస్యల కారణంగా విడుదల కాలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న ఏర్పాటు చేశారు మేకర్స్.
ఈ ఈవెంట్ లో సుధీర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ‘గోట్ ‘ చిత్రం బాగా ఆలస్యం అయ్యినందుకు నన్ను క్షమించండి. నాపై ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటాను , ఈ సినిమా మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక చివర్లో అభిమానులు పెళ్లి ఎప్పుడు అంటూ గోల చేయగా , మనకి పెళ్లి వద్దమ్మా అంటూ చెప్పుకొచ్చాడు. ఈమధ్య కాలం లో సుధీర్ పెళ్లి గురించి సోషల్ మీడియా లో గట్టి చర్చనే నడుస్తోంది. ఎన్నో రూమర్స్ కూడా పుట్టించారు. కానీ ఇప్పట్లో పెళ్లి లేదని ఆయన స్పష్టంగా చెప్పడం తో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే సుధీర్ హీరో గా మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడని , ఆ సక్సెస్ సాధించిన తర్వాత కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని అంటున్నారు అభిమానులు. మరి ఈయన పెళ్లి ఎప్పుడు జరుగుతుందో చూడాలి.