Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ సీఎం జగన్ తో ఫోన్ కాల్ సంభాషణ జరిపినట్టు వస్తున్న వార్తలు ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రస్తుతం జనసేన పార్టీ టీడీపీ తో పొత్తులో ఉంది కదా , ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ కి ఫోన్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటి?, త్వరలో వీళ్లిద్దరు కలవబోతున్నారా వంటి సందేహాలు మీ అందరికీ రావొచ్చు. కానీ అసలు విషయం అది కాదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మొన్న పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజినోవా తో విడాకులు తీసుకున్న వార్త సోషల్ మీడియా లో రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సంగతి అందరికీ తెలిసిందే.
అయితే వైసీపీ పార్టీ మెయిన్ హెడ్ ఆఫీస్ నుండి ఇతరుల వ్యక్తిగత విషయాలపై స్పందించరాదని , ఎలాంటి విమర్శలు చేయొద్దని పార్టీ లీడర్స్ కి , క్యాడర్ కి ఆదేశాలు రావడం తో జనసేన పార్టీ శ్రేణులు అభినందించారు. కీలకమైన ఈ సమయం లో ఇలాంటి ప్రకటన చేసినందుకు పవన్ కళ్యాణ్ మాజీ సీఎం జగన్ కి ఫోన్ చేసి కృతజ్ఞత తెలిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ , సోషల్ మీడియా లో మాత్రం దీనిపై గట్టి చర్చనే నడుస్తోంది. అయితే 2019 నుండి 2024 మధ్యలో వైసీపీ పార్టీ అధినేత జగన్ తో పాటు , ఆ పార్టీ నాయకులూ , కార్యకర్తలు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారాలపై ఏ రేంజ్ లో విమర్శలు చేసేవారో మన అందరం కళ్లారా చూసాం. 2024 లో వైసీపీ కి ఘోరమైన పరాభవం పొందడానికి గల కారణం కూడా ఇదే. అందుకే ఈసారి వైసీపీ రూటు మార్చినట్టు తెలుస్తోంది. మరి వైసీపీ నయా స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.