https://oktelugu.com/

బాధను అణిచిపెట్టి వివరణ ఇచ్చాడు !

ఒక సూపర్ స్టార్ కి అల్లుడు, మరో సూపర్ స్టార్ కి బావ. అన్నిటికి మించి తనకు మూడు హిట్లు ఉన్నాయి. పైగా గత సినిమా సమ్మోహనం సూపర్ హిట్.. అయినా ‘వి’ మేకర్స్ మాత్రం తనను మెయిన్ లీడ్ హీరోగా ఎందుకు గుర్తించడం లేదు. నాని ఏమి టాప్ స్టార్ కాదు కదా.. తనలాగే సెకెండ్ లీడ్ హీరో.. కాకపోతే కొంచెం ఫాలోయింగ్ ఉంది. అంతమాత్రాన తనని నాని ముందు మరీ ఇంత తక్కువ చేయాలా […]

Written By:
  • admin
  • , Updated On : September 1, 2020 / 11:58 AM IST
    Follow us on


    ఒక సూపర్ స్టార్ కి అల్లుడు, మరో సూపర్ స్టార్ కి బావ. అన్నిటికి మించి తనకు మూడు హిట్లు ఉన్నాయి. పైగా గత సినిమా సమ్మోహనం సూపర్ హిట్.. అయినా ‘వి’ మేకర్స్ మాత్రం తనను మెయిన్ లీడ్ హీరోగా ఎందుకు గుర్తించడం లేదు. నాని ఏమి టాప్ స్టార్ కాదు కదా.. తనలాగే సెకెండ్ లీడ్ హీరో.. కాకపోతే కొంచెం ఫాలోయింగ్ ఉంది. అంతమాత్రాన తనని నాని ముందు మరీ ఇంత తక్కువ చేయాలా ? మొదట్లో తానూ సైలెంట్ గా ఉన్న పాపానికి ఇప్పుడు వి మేకర్స్ పైత్యం ఎక్కువైపోయింది. వీరికి నా గురించి తెలియక ఇలా చేస్తున్నారా.. లేక నాని వల్లే ఇలా చేస్తున్నారా.. ఇలా సాగుతోంది ప్రస్తుతం సుధీర్ బాబు ఆలోచనా ధోరణి. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో రానున్న వి సినిమాలో మొదట హీరో సుధీర్ బాబు, విలన్ నాని అన్నారు.

    Also Read: కరోనా పెరుగుతున్నా .. షూటింగ్ స్టార్ట్ చేశాడు !

    అందుకే సుధీర్ బాబు కూడా హీరోలాగే ఈ సినిమా చేశాడు. కానీ, ఆ తరువాత ఈ సినిమా పై మొదటినుంచి సోషల్ మీడియాలో ఇది నాని 25వ చిత్రమని, నాని నుండి వస్తోన్న మరో వైవిధ్యమైన సినిమా అని ఇలా కేవలం నానినే ఫోకస్ చేస్తూ.. సుధీర్ బాబును పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇలాంటి ప్రచారం వచ్చినప్పుడే ఇది ఇద్దరి హీరోల పాత్రల చుట్టూ తిరిగే కథ అని.. ఇందులో నాని, సుధీర్ బాబు ఇద్దరూ సమానమే అని మేకర్స్ కూడా క్లారిటీ ఇవ్వలేదు. దాంతో పూర్తిగా నాని డామినేషన్ ఎక్కువైపోయింది. సుధీర్ బాబు కూడా సినిమాలో హీరో అనే విషయం కూడా సరిగ్గా ప్రమోట్ కూడా కాలేదు. దానికి తోడు సుధీర్ బాబు నానిలా ముందు నుంచీ ఓన్ గా ప్రమోషన్స్ చేసుకున్న సంఘటనలు కూడా లేకపోవడం కూడా సుధీర్ బాబును సైడ్ చేసింది.

    Also Read: వంద కోట్ల ఆఫర్ వద్దనుకున్న ‘మాస్టర్’?

    అయితే సుధీర్ బాబు మాత్రం ఈ విషయం పై రియాక్ట్ అవుతూ.. ‘బలమైన ఇద్దరు వ్యక్తుల ఢీ కొడితే ఎలా ఉంటుందో చూపించేదే ఈ సినిమా కథాకథనాలని.. నేను సినిమాలో మెయిన్ హీరోను కాదు అని బయట వినిపించే మాటలను అంతగా పట్టించుకోనని.. అయినా సినిమా చూశాక మీకే తెలుస్తోంది కదా.. సినిమాలో ఎవరి పాత్ర ఎంత ఉందనేది.. ఎవరు ఎలా చేశారనేది.. అంతమాత్రాన ఇప్పుడే ఎందుకు ఆవేశపడి కామెంట్స్ చేయడం.. అందుకే తానూ మొదటినుండి ఇలాంటి వార్తలు వస్తున్నా.. పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఎవరికి ఎంత పేరు వస్తుందనేది సినిమా రిలీజ్ అయ్యాక మీకే తెలుస్తుంది. అంటూ సుధీర్ బాబు తన బాధను అణిచిపెట్టి ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక ఈ వి సినిమా అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది.