ఓటీటీ.. నిర్మాతలకు ప్రచార ఖర్చును మిగిలిస్తుందా?

‘ఎంకీ పెళ్లి సుబ్బు సావుకొచ్చినట్టు’.. కరోనాతో సినిమా ఇండస్ట్రీ కుదేలవుతుండగా అదేరంగానికి చెందిన ఓటీటీకి మాత్రం కాసులవర్షం కురిపిస్తోంది. కరోనాతో థియేటర్లు మూతపడటం ఓటీటీకి బాగా కలిసొస్తుంది. నిర్మాతలు గత్యంతరంలేక ఓటీటీల్లోనే సినిమాలను విడుదల చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి చిన్న సినిమాలు మినహా పెద్ద సినిమాలేవీ ఓటీటీలో రిలీజ్ కాలేదు. తాజాగా టాలీవుడ్ నుంచి ఓ పెద్ద సినిమా ఓటీటీలో రాబోతుంది. Also Read: బేర్ గ్రిల్స్ తో అక్షయ్ సాహసం చూడాల్సిందే..! దిల్ […]

Written By: NARESH, Updated On : September 1, 2020 12:26 pm
Follow us on

‘ఎంకీ పెళ్లి సుబ్బు సావుకొచ్చినట్టు’.. కరోనాతో సినిమా ఇండస్ట్రీ కుదేలవుతుండగా అదేరంగానికి చెందిన ఓటీటీకి మాత్రం కాసులవర్షం కురిపిస్తోంది. కరోనాతో థియేటర్లు మూతపడటం ఓటీటీకి బాగా కలిసొస్తుంది. నిర్మాతలు గత్యంతరంలేక ఓటీటీల్లోనే సినిమాలను విడుదల చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి చిన్న సినిమాలు మినహా పెద్ద సినిమాలేవీ ఓటీటీలో రిలీజ్ కాలేదు. తాజాగా టాలీవుడ్ నుంచి ఓ పెద్ద సినిమా ఓటీటీలో రాబోతుంది.

Also Read: బేర్ గ్రిల్స్ తో అక్షయ్ సాహసం చూడాల్సిందే..!

దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ‘వి’ సినిమా ఓటీటీలో రాబోతుంది. గత మూడునెలలుగా ఓటీటీ పెద్ద మూవీలు విడుదల కాలేదు. దీంతో ‘వి’ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ‘వి’ మూవీ సెప్టెంబర్ 5న రాబోతుంది. అయితే సినిమా ప్రమోషన్లకు ఓటీటీకి సంబంధం ఉండేది కాదు. అయితే ప్రస్తుతం ఓటీటీలు కూడా ‘వి’ మూవీ నుంచి ఢిపెరెంట్ గా ప్రమోషన్లు షూరు చేసినట్లు కన్పిస్తోంది. ప్రస్తుతం ‘వి’ సినిమా ప్రమోషన్ మొత్తం ఓటీటీనే నిర్వహిస్తుంది.

అమెజాన్ ప్రైమ్ కు భారీ సంఖ్యలో సబ్ స్ర్కయిబర్లు ఉన్నారు. వీరిని ఆకట్టుకునేలా ‘వి’ సినిమా ప్రమోషన్ ను చేపడుతోంది. ఇందులో హీరో, నిర్మాతలకు ఛాన్స్ ఇవ్వకుండా సొంతంగా సినిమా ప్రమోషన్ చేపట్టింది. బాలీవుడ్ తరహాలో ‘వి’ ట్రయిలర్ విడుదల చేయగా ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదనే టాక్ విన్పించింది. దీనిపై నెటిజన్ల నుంచి ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. దీంతో సదరు ఓటీటీ హీరో, నిర్మాతలతో కలిసి జూమ్ లో ప్రమోషన్లు చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక డైరెక్టర్, ఒక హీరోతో ప్రెస్ మీట్ చేసింది. మరోసారి నాని, సుధీర్, నిర్మాత దిల్ రాజుతో ప్రచారం చేయాలని భావిస్తుంది.

Also Read: బ్రేకింగ్ : పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రకటన !

ఓటీటీలే సినిమా ప్రమోషన్లు చేసుకుంటుండటంతో నిర్మాతలకు, హీరోలకు సమయం, ఖర్చు మిగులుతుంది. ఓటీటీలు సైతం జూమ్ లాంటి యాప్ లతో పెద్దగా ఖర్చు పెట్టకుండానే ప్రేక్షకుల ముందుకు వెళుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో సినిమా ప్రమోషన్లు కూడా ఇలానే జరిగేలా కన్పిస్తున్నారు. కొత్త తరహా సినిమా పబ్లిసిటీకి ‘వి’ సినిమా నాంది పలుకడంతో మరిన్ని సినిమాలు కూడా ఆ బాటలోనే నడిచేందుకు సిద్ధమవుతున్నాయి.