Samantha : సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే స్టార్ హీరోయిన్స్ లో ఒకరు సమంత. అప్పుడప్పుడు అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యే ఈమె, పలు అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా లో వాటిని షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఈమె పెట్టే పోస్టులకు, స్టోరీలకు మంచి రీచ్ వస్తూ ఉంటాది. కొన్ని సన్దభాల్లో ఈమె తన మాజీ భర్త నాగ చైతన్య పై పరోక్షంగా సెటైర్లు కూడా వేస్తూ ఉంటుంది. ఇటీవలే నాగచైతన్య శోభిత దూళిపాళ్ల తో రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత సమంత పై జనాల్లో సానుభూతి పెరిగింది. ఇదంతా పక్కన పెడితే సమాజంలో జరిగే కొన్ని సెన్సెటివ్ అంశాలపై తనకు తప్పు అనిపిస్తే, కచ్చితంగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ తన గళం వినిపించడంలో సమంత ఎప్పుడూ ముందు ఉంటుంది. రీసెంట్ గా ఆమె పెట్టిన స్టోరీ బాగా వైరల్ అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే జనవరి 15 వ తారీఖున తోటి విద్యార్థుల ర్యాగింగ్ ని తట్టుకోలేక ఒక విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ బిడ్డ తల్లి ఈ విషయం పై తన బిడ్డ ఎదురుకున్న అవమానకరమైన పరిస్థితులను వివరిస్తూ, కన్నీటి పర్యంతం అవుతూ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టింది. అది ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. దీనిని సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేస్తూ చాలా భావోద్వేగానికి గురైంది. ఆమె మాట్లాడుతూ ‘మనం ఇప్పుడు 2025 వ సంవత్సరం లో ఉన్నాము. అయినప్పటికీ విద్యార్థి దశ నుండే ద్వేషం, విషపూరిత స్వభావం నిండి ఉన్న మనుషులు మన సమాజం లో ఉండడం బాధాకరం. అలాంటి వాళ్ళ వల్ల నిండు పసి ప్రాణం నేడు బలైంది. ర్యాగింగ్ వంటి చర్యలు ఎంత ప్రమాదకరమైనవో ఈ ఘటనని చూస్తే తెలుస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘మన దేశంలో కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి. కానీ కొంతమంది విద్యార్థులు తాము ఎదురుకుంటున్న ఇలాంటి సంఘటనలను బయట చెప్తే ఏమి జరుగుతుందో అనే భయంతో లోపలే దాచుకొని ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలను కొని తెచ్చుకుంటున్నారు. ఇక్కడే విఫలం అవుతున్నారు. ఇలాంటి ఘటనపై సంతాపం తెలియచేసి చేతులు దులుపుకుంటే సరిపోదు, కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేయాలి. అధికారులు ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తారని ఆశిస్తున్నాను. ఆ విద్యార్థికి కచ్చితంగా న్యాయం జరగాలి, బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా జాగ్రత్త పడాలి’ అంటూ సమంత మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సమంత కి మొదటి నుండి ఇలాంటి సామజిక స్పృహ ఉంది. ఆమె ఆలోచనలు చూస్తుంటే, త్వరలోనే ఈమె రాజకీయాల్లోకి రాబోతోందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.