Pooja : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచి, స్టార్ హీరోయిన్ స్టేటస్ ని దక్కించుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. కేవలం కొంతమందికి మాత్రమే ఆ అరుదైన అదృష్టం కలుగుతుంది. ఆ కొంతమందిలో ఒకరు పూజా హెగ్డే. ‘ఒక లైలా కోసం’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈమె, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా అవకాశాలను సంపాదించుకుంది. రెండవ చిత్రం ‘ముకుంద’ ఫ్లాప్ అయినప్పటికీ, ఆమెకు బాలీవుడ్ లో ఏకంగా హ్రితిక్ రోషన్ లాంటి సూపర్ స్టార్ పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా కూడా పెద్ద ఫ్లాప్ అవ్వడంతో రెండేళ్ల పాటు విరామం తీసుకొని, ‘దువ్వాడ జగన్నాథం’ అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక అక్కడి నుండి పూజా హెగ్డే కెరీర్ ఎలా దూసుకెళ్ళిందో మనమంతా చూసాము.
వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ని సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే సౌత్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగుతో పాటు ఈమెకు వరుసగా హిందీ సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. ఇటు తెలుగు సినిమాలు చేస్తూ, అటు హిందీ సినిమాలు చేస్తూ, మధ్యమధ్యలో కోలీవుడ్ సినిమాలు కూడా చేస్తూ కెరీర్ ని సాగదీస్తున్న ఈమెకు ఇటీవల కాలంలో కష్టకాలం మొదలైంది. ఈమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో ఆమె తెలుగు కంటే ఎక్కువగా హిందీ సినిమాల మీదనే ఫోకస్ పెట్టింది. రీసెంట్ గా ఆమె షాహిద్ కపూర్ తో కలిసి చేసిన ‘దేవా’ చిత్రం విడుదలైంది. భారీ అంచనాల నడుమ నిన్న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
యాంకర్ పూజ హెగ్డే ని ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడుగుతూ ‘ప్రస్తుతం మీరు సింగల్ గా ఉన్నారా, లేక ప్రేమలో ఉన్నారా?’ అని అడగగా, దానికి ఆమె సమాధానం చెప్తూ ‘కచ్చితంగా సింగల్ గా అయితే లేను, ప్రేమలోనే ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది. ఈమధ్య కాలం లో ఈమె ఒక బాలీవుడ్ యంగ్ హీరోతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి ప్రైవేట్ పార్టీలకు పబ్బులకు వెళ్లడం వంటివి అక్కడి మీడియాకి దొరికాయి. అయితే ఎవరు ఆ హీరో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పూజా హెగ్డే సైతం ప్రేమలో ఉన్నానని చెప్పడంతో ఈ ఏడాది ఈమె కూడా పెళ్లి చేసుకుంటుంది అంటూ సోషల్ మీడియా లో ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె తమిళం లో సూర్య తో కలిసి ‘రెట్రో’ అనే చిత్రం చేసింది. సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.