Subhalekha Sudhakar: ఇప్పటి తరం నటుగు కేవలం ఒక జోనర్ పాత్రలకే పరిమితం అవుతున్నారు. కానీ ఒకప్పటి వారు మాత్రం అన్ని జోనర్లలో తమ నటనా ప్రతిభను చాటుకున్నారు. అలాంటి వారిలో శుభలేఖ సుధాకర్ కూడా ఒకరు. లెజెండరీ డైరెక్టర్ కె.విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన శుభలేఖ మూవీ ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. దాంతో అప్పటి నుంచా ఆమూవీ పేరునే ఆయన పేరు ముందు ఉంచుకున్నారు.

కాగా ఆయన ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తన ట్యాలెంట్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. హీరో, విలన్, సైడ్ క్యారెక్టర్, సపోర్టివ్ క్యారెక్టర్ ఇలా ఏ పాత్ర ఇచ్చినా సరే కాదనకుండా నటించి మెప్పించారు. హీరో అవ్వాలని ప్రయత్నించినా.. ఎక్కువ కాలం ఆయన హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. దాంతో వచ్చిన ప్రతి క్యారెక్టర్‌ను కాదనకుండా చేసి గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read: ప్రేమించి పెండ్లి చేసుకున్న ఈ స్టార్ హీరోలకు పిల్లలు లేక బాధపడ్డారు.. వారెవరంటే
కాగా ఆయన ఈ మధ్య ఓ యూ ట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. తాను మొదట్లో పడ్డ కష్టాల గురించి వివరించారు. తాను పెద్దలు కుదిర్చిన పెండ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చారు. కాగా తన భార్య ఎస్పీ శైలజ గురించి అందరికీ పరిచయమే అని వివరించారు. కాగా తన పెండ్లి తర్వాత తనకు కష్టాలు మొదలయ్యాయన్నారు.

పెండ్లియినప్పటి నుంచి దాదాపు ఎనిమిది నెలల దాకా అస్సలు అవకాశాలు రాక ఇబ్బందులు పడ్డట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో నెల గడవడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డామని, అయితే తన భార్య తనను అర్థం చేసుకోవడం వల్ల కష్టాలు ఎదురీదానని వెల్లడించారు. అయితే ఇప్పుడు తాను, తన భార్య ఇండస్ట్రీలో బాగానే రాణిస్తున్నామని, అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయని చెప్పారు. ఆయన ప్రస్తుతం టాలీవుడ్ లో మూడు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి చెన్నైలో ఉంటున్నారు ఆయన.
Also Read: ‘భీమ్లా నాయక్’ ఏపీ & తెలంగాణ సెకండ్ డే కలెక్షన్స్
