https://oktelugu.com/

Poonam Kaur: అక్కా, పవన్ బావ సినిమాకు వెళ్లాను’.. పూనమ్ కొత్త పోస్ట్

Poonam Kaur: ఫేడ్ అవుట్ హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదొక రచ్చకు తెర తీస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె పెట్టే ప్రతి ట్వీట్‌ లో, ప్రతి పోస్ట్‌ లో ప్రతి మెసేజ్ లో ఎన్నో నిగూడార్థాలు ఉంటాయి. అసలు అందరిదీ ఒక బాధ అయితే.. ఆమెది మరో బాధ అన్నట్టు ఉంటుంది ఆమె వ్యవహారం. కాగా తాజాగా హీరోయిన్ పూనమ్ కౌర్ ట్విట్టర్‌లో పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. మ్యాడీ అనే […]

Written By:
  • Shiva
  • , Updated On : February 26, 2022 / 10:53 AM IST
    Follow us on

    Poonam Kaur: ఫేడ్ అవుట్ హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదొక రచ్చకు తెర తీస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె పెట్టే ప్రతి ట్వీట్‌ లో, ప్రతి పోస్ట్‌ లో ప్రతి మెసేజ్ లో ఎన్నో నిగూడార్థాలు ఉంటాయి. అసలు అందరిదీ ఒక బాధ అయితే.. ఆమెది మరో బాధ అన్నట్టు ఉంటుంది ఆమె వ్యవహారం. కాగా తాజాగా హీరోయిన్ పూనమ్ కౌర్ ట్విట్టర్‌లో పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.

    Poonam Kaur

    మ్యాడీ అనే వ్యక్తితో జరిపిన వాట్సాప్ చాట్‌ ను ఆమె షేర్ చేసింది. అందులో ‘అక్కా, బావ సినిమాకు వెళ్లాను’ అని మరో వ్యక్తి మెసేజ్ చేయడం.. ‘సినిమా ఎలా ఉందో నిజాయతీగా చెప్పు’ అని పూనమ్ అడగడం.. ‘మూవీ హిట్, నన్ను నమ్ము అక్కా’ అని అతను రిప్లై ఇవ్వడం ఇలా సాగింది వీరి చర్చ. అయితే భీమ్లానాయక్ గురించే పూనమ్ ఈ ట్వీట్ చేసి ఉండొచ్చని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

    Also Read: ‘భీమ్లా నాయక్’ ఏపీ & తెలంగాణ సెకండ్ డే కలెక్షన్స్

    మొత్తానికి పూనమ్ కౌర్ తన కామెంట్స్ తో మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఏది ఏమైనా తనకు సంబంధించిన ప్రతిదీ నెటిజన్లతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా పూనమ్ పెట్టిన ఈ ట్వీట్ కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పైగా ఈ ట్వీట్ అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఎందుకంటే పూనమ్ పాప పెట్టిన ట్వీట్ పవన్ గురించి కావడమే.

    Poonam Kaur

    సహజంగానే తనకు ఇష్టమొచ్చినట్లు మెసేజ్ లు రాసుకుంటూ పోతుంది పూనమ్. అసలు ఈ ట్వీట్ ఎందుకు పోస్ట్ చేసింది ? పవన్ సినిమా పై ఈమెకు ఎందుకు ఇంత ఆత్రుత ? గతంలో పవన్ కళ్యాణ్ పై ఇన్ డైరెక్ట్ గా అనేక ఆరోపణలు చేస్తూ.. మధ్యమధ్యలో పవన్ ను సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అసలు ఆమె బాధ ఏమిటో ఎవరికీ అర్థం కాకుండా పోతుంది.

    మొత్తమ్మీద హిట్ అవ్వకుండానే ఫేడ్ అవుట్ అయిన ఈ పంజాబీ భామకు మైండ్ సరిగ్గా లేదని ఆ మధ్య ఓ నటుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. అయితే పవన్ సినిమా పై పూనమ్ ఇలా ప్రేమను చూపించింది అంటున్నారు నెటిజన్లు.

    Also Read: భీమ్లానాయక్ ప్రభావం గట్టిగానే కనిపించింది ! 

    Tags