https://oktelugu.com/

కాజల్ ముందుచూపు.. సైడ్ బిజినెస్ షూరు..!

సౌత్ ఇండస్ట్రీలోని అగ్ర కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. 35ఏళ్ల ఈ వెటరన్ బ్యూటీ ఇటీవలే గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని కాజల్ అగర్వాల్ ముందుగానే ప్రకటించడంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. Also Read: మెగాస్టార్ కోలువాలని పూజలు చేస్తున్న హీరోయిన్.. ఎవరో తెలుసా? కరోనా.. లాక్డౌన్ సమయాన్ని కూడా కాజల్ సద్వినియోగం చేసుకుంది. కరోనా ఎఫెక్ట్ తో షూటింగులు నిలిచిపోగా ఈ గ్యాప్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2020 / 07:49 PM IST
    Follow us on


    సౌత్ ఇండస్ట్రీలోని అగ్ర కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. 35ఏళ్ల ఈ వెటరన్ బ్యూటీ ఇటీవలే గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని కాజల్ అగర్వాల్ ముందుగానే ప్రకటించడంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు.

    Also Read: మెగాస్టార్ కోలువాలని పూజలు చేస్తున్న హీరోయిన్.. ఎవరో తెలుసా?

    కరోనా.. లాక్డౌన్ సమయాన్ని కూడా కాజల్ సద్వినియోగం చేసుకుంది. కరోనా ఎఫెక్ట్ తో షూటింగులు నిలిచిపోగా ఈ గ్యాప్ లోని పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చింది. తన చిన్ననాటి స్నేహితుడు.. బిజినెస్ మ్యాన్ అయిన గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. ప్రస్తుతం మాల్డీవుల్లో హనీమూన్ ట్రిప్ ను కాజల్ ఎంజాయ్ చేస్తోంది.

    దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న చందంగా కాజల్ అగర్వాల్ గ్లామర్ ఉన్నంత సేపు సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఎలా అని ముందుగానే ఆలోచిస్తోంది. దీంతో ముందుగానే ఆమె తన ఫ్యూచర్ కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా బిజినెస్ ఉమెన్ గా కాజల్ మారింది.

    Also Read: అనుష్కపై ‘నిశబ్దం’ ఎఫెక్ట్.. మళ్లీ బ్రేక్ తీసుకుంటుందా?

    కాజల్ అగర్వాల్ తాజాగా ఓకీ అనే గేమింగ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీలో 15శాతం వాటా కొనుగోలు చేసి బోర్డు మెంబర్ గా చోటు సంపాదించింది. పెళ్లి తర్వాత సినిమాల అవకాశాలు తగ్గుతాయని ముందే ఊహించిన కాజల్ ముందుగానే సైడ్ బిజినెస్ షూరు చేసింది. మున్మందు సినిమా ఆఫర్లు తగ్గినా గేమింగ్ కంపెనీతో బాగానే సంపాదించుకోవాలని ఆశ పడుతుంది. బిజినెస్ ఉమెన్ గా మారిన కాజల్ కు ఈ రంగం ఏమేరకు కలిసి వస్తుందో వేచిచూడాల్సిందే..!

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్