https://oktelugu.com/

Allu Arjun : మరోసారి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్.. కన్నీళ్లు పెట్టిన స్నేహారెడ్డి..ఓదార్చి బయలుదేరిన అల్లు అర్జున్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని నిన్న సాయంత్రం హైదరాబాద్ పోలీసులు, నేడు ఉదయం 11 గంటలకు విచారణ కోసం పోలీస్ స్టేషన్ కి రమ్మని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 24, 2024 / 01:46 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని నిన్న సాయంత్రం హైదరాబాద్ పోలీసులు, నేడు ఉదయం 11 గంటలకు విచారణ కోసం పోలీస్ స్టేషన్ కి రమ్మని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితమే అల్లు అర్జున్ తన ఇంటి వద్ద నుండి చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కి తన సొంత కారులో బయలుదేరాడు. వెళ్లే ముందు భార్య స్నేహా రెడ్డి, తండ్రి అల్లు అరవింద్, కొడుకు అల్లు అయాన్ టెన్షన్ పడుతూ ఆయనతో పాటు బయటకి రాగా, అందరికి అల్లు అర్జున్ ధైర్యం చెప్పి పోలీస్ స్టేషన్ కి బయలుదేరాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన ఇంటి వద్ద మొన్న దాడి జరిగిన ఘటన ని దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ ఇంటి వద్ద పోలీసులు భద్రతని భారీ గా పెంచారు.

    అల్లు అర్జున్ మరోసారి పోలీస్ స్టేషన్ కి వెళ్లబోతున్నాడు అనే వార్త ప్రచారం అవ్వడంతో, పెద్ద ఎత్తున అభిమానులు రోడ్డు మీదకు వచ్చే అవకాశం ఉన్నందున, ఆయన వెళ్తున్న దారిలో కూడా పెద్ద ఎత్తున సెక్యూరిటీ పెంచారు. అదే విధంగా చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కూడా పటిష్టమైన సెక్యూరిటీ ని ఏర్పాటు చేసారు. నేడు అల్లు అర్జున్ ని ఆరోజు రాత్రి జరిగిన సంఘటనల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకోనున్నారు. సీన్ రీ క్రియేట్ చేయడానికి ఆయన్ని మరోసారి సంధ్య థియేటర్ కి తీసుకెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. ఈ ఘటనపై తదుపరి కార్యాచరణ ఏమి ఉంటుంది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్ పరిస్థితి ని చూసి ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. A11 ముద్దాయి గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ని ఇంతలా టార్చర్ చేస్తున్నారేంటి, కావాలని చేసిన తప్పు కాకపోయినప్పటికీ కూడా ఇంత ఇబ్బంది పెట్టడం అభిమానులకు తీవ్రమైన బాధని కలిగిస్తుంది.

    తెలుగు సినిమా నుండి జాతీయ అవార్డుని అందుకున్న ఏకైక హీరో ని ఇలా అమర్యాదగా డీల్ చేయడం, చీటికీమాటికీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం అన్యాయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తప్పులు చేసిన వాళ్లేమో స్వేచ్ఛగా దర్జాగా బయట తిరుగుతున్నారు. కానీ ఏ తప్పు చెయ్యని అల్లు అర్జున్ ని ఇంతలా టార్గెట్ చెయ్యాలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్. నిన్న గాక మొన్న అల్లు అర్జున్ ఇంటి పై దాడి చేసిన వ్యక్తులు ఒక్క రోజు కూడా గడవకముందే బెయిల్ మీద ఎలాంటి ఆంక్షలు లేకుండా విడుదలయ్యారు. ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినవాళ్ళకి ఏమో శిక్ష లేదు, దురదృష్టకర సంఘటనకి పరోక్షంగా కారణమైన అల్లు అర్జున్ ని మానసికంగా ఇంతలా వేధించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ విస్లేహకులు సైతం అభిప్రాయపడుతున్నారు.