https://oktelugu.com/

Stree 2 Collection: 5 రోజుల్లో ‘కల్కి’ క్లోసింగ్ కలెక్షన్స్ ని ‘స్త్రీ2’ దాటేయడానికి కారణాలు ఇవేనా..? సీక్వెల్ కి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. 'స్త్రీ 2' లో ప్రధాన పాత్ర పోషించిన శ్రద్దా కపూర్ గతంలో ప్రభాస్ తో 'సాహూ' చిత్రంలో నటించింది. ప్రభాస్ మార్కెట్ తో పోలిస్తే శ్రద్ద కపూర్ మార్కెట్ పావు శాతం కూడా ఉండదు. అలాంటి స్థాయి ఉన్న శ్రద్ద కపూర్ సినిమా 5 రోజుల్లో 250 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను సాధించడం చిన్న విషయం కాదు కదా.

Written By:
  • Vicky
  • , Updated On : August 23, 2024 / 03:51 PM IST

    Stree 2 Collection

    Follow us on

    Stree 2 Collection: ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల ఓపెనింగ్స్ కి, చిన్న హీరోల సినిమాల ఓపెనింగ్స్ చాలా వ్యత్యాసం ఉండేది. స్టార్ హీరో సినిమా మొదటి రోజు 50 కోట్ల రూపాయిలను రాబడితే, చిన్న హీరో సినిమా ఫుల్ రన్ లో అంత వసూళ్లను రాబట్టేది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. కంటెంట్ సినిమా ముందు స్టార్ హీరోల సినిమాలు నిలబడలేకపోతున్నాయి. అందుకు ఉదాహరణ రీసెంట్ గా విడుదలైన ‘కల్కి’, ‘స్త్రీ 2’ చిత్రాలు. కల్కి సినిమా బ్రహ్మాండం గా ఆడింది కదా, 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించిన సినిమాతో ‘స్త్రీ 2’ ని పోలుస్తున్నారేంటి అని మీరంతా అనుకోవచ్చు. అక్కడికే వస్తున్నాం. స్త్రీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కల్కి రేంజ్ వసూళ్లను రాబట్టలేకపోయుండొచ్చు, కానీ బాలీవుడ్ లో మాత్రం ‘కల్కి’ చిత్రం జీవిత కాలం లో సాధించిన వసూళ్లను కేవలం 5 రోజుల్లో ‘స్త్రీ 2’ చిత్రం అధిగమించేసింది.

    ఇదే ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ‘స్త్రీ 2’ లో ప్రధాన పాత్ర పోషించిన శ్రద్దా కపూర్ గతంలో ప్రభాస్ తో ‘సాహూ’ చిత్రంలో నటించింది. ప్రభాస్ మార్కెట్ తో పోలిస్తే శ్రద్ద కపూర్ మార్కెట్ పావు శాతం కూడా ఉండదు. అలాంటి స్థాయి ఉన్న శ్రద్ద కపూర్ సినిమా 5 రోజుల్లో 250 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను సాధించడం చిన్న విషయం కాదు కదా. ఆ చిత్రంలోని కంటెంట్ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించి ఉండుంటే ఆ స్థాయి వసూళ్లు వచ్చి ఉంటుంది?. బాలీవుడ్ ఆడియన్స్ అలాంటి కళ్ళు చెదిరే వసూళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా కల్కి చిత్రం బాలీవుడ్ లో 300 కోట్ల రూపాయిల లోపే బిజినెస్ ని క్లోజ్ చేసుకుందంటే దాని అర్థం కంటెంట్ అన్నీ వర్గాల ప్రేక్షకులకు చేరలేదనే. కల్కి చిత్రానికి చేసిన ఖర్చు, వాడిన టెక్నాలజీ ‘స్త్రీ 2 ‘ లో కనిపించవు. అయినప్పటికీ కూడా ఆ సినిమాకి సూపర్ స్టార్ హీరో రేంజ్ వసూళ్లు వస్తున్నాయి అంటేనే అర్థం చేసుకోండి.

    ప్రభాస్ కి అలాంటి స్థాయి కంటెంట్ ఉన్న సినిమా పడితే కేవలం హిందీ వెర్షన్ నుండి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టగలడు. ఆ స్థాయి స్టామినా ఆయనలో ఉంది. కాబట్టి ‘కల్కి’ సీక్వెల్ కి డైరెక్టర్ నాగ అశ్విన్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కంటెంట్ కేవలం ఒక సెక్షన్ ఆడియన్స్ కి మాత్రమే అర్థం అయ్యేలా తియ్యడం కాదు, చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరికి అర్థం అయ్యేలా తియ్యాలి. అలా తీస్తే ప్రభాస్ లాంటి సూపర్ స్టార్స్ వసూళ్ల విషయం లో హాలీవుడ్ సినిమాలతో కూడా పోటీ పడగలరు. డైరెక్ట్ నాగ అశ్విన్ కి అలాంటి అద్భుతమైన అవకాశం వచ్చింది. మరి నిరూపించుకుంటాడో లేదో చూడాలి.