Stree 2 Collection: చాలా కాలం నుండి టాలీవుడ్ డామినేషన్ ని ఎదురుకుంటున్న బాలీవుడ్ ఒక సరైన హిట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తుంది. షారుఖ్ ఖాన్ భారీ గా కం బ్యాక్ ఇస్తూ రెండు వెయ్యి కోట్ల రూపాయిల సినిమాలను బాలీవుడ్ కి అందించాడు కానీ, టాప్ 5 లో ఇప్పటికీ సౌత్ ఇండియన్ సినిమాల డామినేషన్ కొనసాగుతుంది. ఇక ఈ ఏడాది కల్కి చిత్రం వచ్చే వరకు బాలీవుడ్ థియేటర్స్ ఖాళీగా ఉండేవి. కనీసం కరెంటు థియేటర్స్ కరెంటు ఖర్చులను కూడా మిగిలించే సినిమాలు రాలేదు. అలాంటి పరిస్థితిలో మన తెలుగు హీరోనే బాలీవుడ్ కి ఆపద్బాంధవుడు అయ్యాడు. అలా బాలీవుడ్ కఠినమైన సమయాన్ని ఎదురుకుంటున్న సమయంలో వచ్చిన ‘స్త్రీ2’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రోజురోజుకి సృష్టిస్తున్న సునామి ని చూసి ట్రేడ్ పండితులకు కూడా మతి పోయింది.
మూడవ వీకెండ్ లో కూడా ఈ సినిమాకి 60 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వస్తాయని బాలీవుడ్ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. గురువారం రోజు ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా 9 కోట్ల 10 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. అయితే శుక్రవారం రోజు ఈ సినిమాకి 35 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు అదనంగా వచ్చాయట. అంటే 9 కోట్ల 45 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు అన్నమాట. ఇలాంటి ట్రెండ్ ఉన్న ఈ సినిమాకి నేడు, రేపు చెరో 20 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వస్తాయని, మూడవ వీకెండ్ లో 60 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరం ఆదర్శ్ అంటున్నాడు. ఇదంతా పక్కన పెడితే 16 రోజులకు గాను ఈ సినెమా 462 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిందట. ఈ వీకెండ్ తో ఈ చిత్రం 500 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను అధిగమించి ఆల్ టైం టాప్ 5 లోకి వస్తుందని అంటున్నారు.
ఇప్పటి వరకు బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ సినిమాలు, అలాగే రణబీర్ కపూర్ ‘ఎనిమల్’ చిత్రాలు మాత్రమే 500 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టాయి. ఇవి కాకుండా ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ 500 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. గ్రాస్ వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే స్త్రీ 2 చిత్రం 700 కోట్ల రూపాయలకు దగ్గరగా ఉందట. మరో రెండు, మూడు వారాలు బలమైన బాక్స్ ఆఫీస్ రన్ వచ్చే సూచనలు ఉండడంతో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి అవలీలగా చేరుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. కేవలం హిందీ వెర్షన్ కి మాత్రమే ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో దబ్ చేసి విడుదల చేసుంటే ఇంకెంత వసూళ్లు వచ్చేవో అని ట్రేడ్ పండితులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.