https://oktelugu.com/

Gabbar Singh Re Release: సోమవారం రోజు ‘మొత్తం పోతారు’..’గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ మేనియాపై హీరో నాని షాకింగ్ కామెంట్స్!

సాధారణమైన విషయం కాదు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన 'సరిపోదా శనివారం' చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని, బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లతో ముందుకు దూసుకుపోతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : August 31, 2024 / 06:36 PM IST

    Gabbar Singh Re Release

    Follow us on

    Gabbar Singh Re Release: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ మేనియా నే కనిపిస్తుంది. టికెట్స్ కోసం అభిమానులు కొట్టుకుంటున్నారు. 12 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమాని, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 వ తేదీన గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. 4K క్వాలిటీ తో, అదిరిపోయే డీటీఎస్ మిక్సింగ్ తో ఈ ప్రింట్ ని తయారు చేయించాడు నిర్మాత బండ్ల గణేష్. నేడు ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. సోమవారం రోజు ఒక రీ రిలీజ్ సినిమాకి కొత్త సినిమాని మించి అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    ఇది సాధారణమైన విషయం కాదు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని, బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లతో ముందుకు దూసుకుపోతుంది. అయితే సోమవారం నాడు ఏ కొత్త సినిమాకైనా వసూళ్లు తగ్గుతాయి కాబట్టి, సరిపోదా శనివారం చిత్రానికి సంబంధించిన షోస్ చాలావరకు ‘గబ్బర్ సింగ్’ కి కేటాయించారు థియేటర్స్ ఓనర్స్. ఆ షోస్ కూడా హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి. నేడు ‘సరిపోదా శనివారం’ సక్సెస్ అయిన సందర్భంగా మూవీ టీం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఒక విలేఖరి నిర్మాత దానయ్య ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ప్రతీ సినిమాకి సోమవారం వచ్చే వసూళ్లు ఎంతో కీలకం. ఆ వసూళ్లను బట్టే సినిమా భవిష్యత్తు లాంగ్ రన్ ఆధారపడుతుంది. అలాంటిది మీ సినిమాకి కేటాయించిన షోస్ ఇప్పుడు సోమవారం నాడు విడుదల అవుతున్న గబ్బర్ సింగ్ కి కేటాయిస్తున్నారు, దీనిపై మీ స్పందన ఏమిటి? ‘ అని అడుగుతాడు.

    దానికి దానయ్య సమాధానం ఇస్తూ ‘అది గబ్బర్ సింగ్..పవర్ స్టార్ లెవెల్ వేరు..మాది నేచురల్ స్టార్ సినిమా’ అని అంటాడు. ఆ తర్వాత నాని మైక్ అందుకొని ‘సోమవారం నాడు గబ్బర్ సింగ్ కి మేము కూడా వెళ్తున్నాం’ అని జవాబు ఇస్తాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. నాని తరహా హీరో కూడా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కోసం ఇంతలా ఎదురు చూస్తున్నాడంటే, ఆ సినిమాకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ట్రెండ్ ని చూస్తుంటే, ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ మొదటి రోజే రాబట్టే అవకాశాలు ఉన్నాయట, చూడాలి మరి.