https://oktelugu.com/

Stree 2 Box Office Collections : ‘స్త్రీ 2’ 32 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. వెయ్యి కోట్ల గ్రాస్ కి ఇంకా ఎంత దూరంలో ఉందంటే!

ఇప్పుడు 'స్త్రీ 2 ' చిత్రం 30 రోజులకు 583 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టి 'ఎనిమల్' చిత్రాన్ని భారీ మార్జిన్ తో అధిగమించింది. త్వరలోనే ఈ సినిమా షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రం వసూళ్లను కూడా దాటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు

Written By:
  • NARESH
  • , Updated On : September 18, 2024 / 11:08 AM IST

    Stree 2 Box Office Collections

    Follow us on

    Stree 2 Box Office Collections : ఈ ఏడాది టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా చిన్న సినిమాల హవానే ఎక్కువగా కనిపిస్తుంది. తెలుగు లో కల్కి చిత్రం తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద బలమైన వసూళ్లను రాబట్టిన సినిమాలు చిన్న సినిమాలే. ‘హనుమాన్’, ‘ఆయ్’, ‘కమిటీ కుర్రాళ్ళు’, ‘మత్తు వదలరా 2’ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించాయి. ఇవి కాకుండా మీడియం రేంజ్ హీరోలలో నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రం వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. సరిగ్గా ఇలాగే బాలీవుడ్ లో కూడా మీడియం రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన ‘స్త్రీ 2 ‘ చిత్రం చరిత్ర తిరగరాసింది. ఆగస్టు 15 వ తారీఖున విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

    ఆ టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ నుండే సునామీ ని తలపించే వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. మొదటి వారం లోనే ‘కల్కి’ హిందీ వెర్షన్ ఫుల్ రన్ వసూళ్లను దాటేసిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటైన ‘ఎనిమల్’ చిత్రాన్ని దాటేసింది. సందీప్ వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఎనిమల్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫుల్ రన్ లో 553 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు కేవలం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టింది. ఇప్పుడు ‘స్త్రీ 2 ‘ చిత్రం 30 రోజులకు 583 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టి ‘ఎనిమల్’ చిత్రాన్ని భారీ మార్జిన్ తో అధిగమించింది. త్వరలోనే ఈ సినిమా షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రం వసూళ్లను కూడా దాటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. షారుఖ్ ఖాన్- అట్లీ కాంబినేషన్ లో వచ్చిన జవాన్ చిత్రం 640 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టింది. ఈ సినిమా రికార్డుని వచ్చే రెండు వారాల్లో స్త్రీ 2 అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

    అదే కనుక జరిగితే ఇన్నేళ్ల బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ హిస్టరీ లో ఒక నెంబర్ 1 గ్రాసర్ గా నిల్చిన ఏకైక లేడీ ఓరియెంటెడ్ చిత్రం గా ‘స్త్రీ 2 ‘ సరికొత్త చరిత్ర సృష్టించిన సినిమాగా నిలుస్తుంది. ఇక గ్రాస్ లెక్కల్లోకి వస్తే, ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు ఈ చిత్రం 750 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిందట. అలాగే ఓవర్సీస్ లో ఈ చిత్రం 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టిందట. మొత్తం మీద 900 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో మరో వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టి వెయ్యి కోట్ల రూపాయిలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.