https://oktelugu.com/

Balakrishna: డైరెక్టర్ క్రిష్ ను కోలుకోలేని దెబ్బకొట్టిన బాలయ్య…అసలు ఇప్పుడు ఆయన ఇండస్ట్రీ లో ఉన్నాడా..?

తెలుగు లో చాలా మంది దర్శకులు ఉన్నప్పటికీ క్రిష్ లాంటి దర్శకుడికి సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపు అయితే ఉంటుంది. ఎందుకంటే ఆయన సినిమాల్లో మనం సమాజంలో చూసే క్యారెక్టర్లు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి.

Written By:
  • Gopi
  • , Updated On : September 18, 2024 / 11:05 AM IST

    Balakrishna(3)

    Follow us on

    Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు క్రిష్ ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే క్రిష్ కెరియర్ మొదట్లో గమ్యం, వేదం లాంటి సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ప్రేక్షకుల్లో కూడా డిఫరెంట్ అటెంప్ట్ చేయగలడు అనే ఒక గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి క్రమంలో ఆయన టాప్ డైరెక్టర్ గా ఎదుగుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఆయన ఇమేజ్ అయితే భారీగా డ్యామేజ్ అయినందనే చెప్పాలి. ఇక బాలయ్య బాబుతో చేసిన కథానాయకుడు, మహా నాయకుడు రెండు సినిమాల ద్వారా ఆయన మంచి గుర్తింపు సంపాదించుకుంటాడు అని అనుకుంటే అప్పటివరకు ఉన్న గుర్తింపు మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఇక ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు అనే సినిమాని స్టార్ట్ చేశాడు. ఈ సినిమా స్టార్ట్ అయి నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆ సినిమా ఇంకా పూర్తి కాకపోవడంతో ఇక ఈ సినిమా పూర్తి అయ్యేలా లేదు అని అనుకున్న క్రిష్ ఆ మూవీ నుంచి తప్పుకున్నాడు.

    ఇక ప్రస్తుతం అనుష్కతో ఒక ప్రాజెక్టుని చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బలకి క్రిష్ కోలుకోలేకపోయడనే చెప్పాలి. ఇక మొత్తానికైతే క్రిష్ లాంటి స్టార్ డైరెక్టర్ ఇన్ని రోజులపాటు ఖాళీగా ఉండడం అనేది నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

    ఆయన నుంచి సినిమాలు వస్తూనే ఉంటాయి. ఆ సినిమా సక్సెస్ అవుతూనే ఉంటాయి అంటూ చాలామంది క్రిటిక్స్ సైతం ఆయన సినిమాలకు పాజిటివ్ రివ్యూలను ఇస్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలో క్రిష్ ఇకమీదట చేయబోయే సినిమాలతో అయిన భారీ సక్సెస్ లను అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇప్పటికే ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి విజయాలను దక్కించుకోవాల్సింది.

    కానీ ఆయన కంటే వెనక వచ్చిన దర్శకులు కూడా ఆయనను బీట్ చేసి స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతుంటే ఈయన మాత్రం బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బలకు కోలుకోలేక ఢీలా పడ్డాడు. మరి ఇలాంటి సందర్భంలో మళ్లీ ఆయన బౌన్స్ బ్యాక్ అయి భారీ సక్సెస్ అందిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక రాబోయే సినిమాతో ఆయన సక్సెస్ లను సాధించి ఫ్యూచర్ లో ఎంత మంచి గుర్తింపును సంపాదించుకుంటాడా లేదా అనేది చూడాలి…