Vishwambhara movie controversy: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం ‘విశ్వంభర'(Viswambhara Movie). శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం, కేవలం VFX వర్క్ బ్యాలన్స్ ఉండడం వల్ల ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. ఈ ఏడాది లో కూడా ఈ చిత్రం విడుదల అవ్వడం కష్టమే. ముందుగా సెప్టెంబర్ 25 న విడుదల చేస్తారని ఒక టాక్ నడిచింది. ఇప్పుడు అక్టోబర్ నెలలో విడుదల చెయ్యాలని అనుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. కానీ ఈ సినిమా డైరెక్టర్ వశిష్ఠ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ సినిమా విడుదల తేదీపై ఒక క్లారిటీ ఇచ్చేసాడు. ఆయన మాట్లాడుతూ ’80 శాతం VFX వర్క్ పూర్తి అయ్యింది. ఇంకా 20 శాతం బ్యాలన్స్ ఉంది. మొత్తం VFX పూర్తి అయ్యాక, ఫైనల్ ఔట్పుట్ చూసుకొని నాకు ఓకే నచ్చింది అనిపిస్తేనే సినిమా విడుదల తేదీని లాక్ చెయ్యమని చెప్తాను, అప్పటి వరకు లేదు’ అని చెప్పుకొచ్చాడు వశిష్ట.
Also Read: రష్మికకు భారీ షాక్… సమంత అంత తోపా?
దీంతో విశ్వంభర ఇప్పట్లో రాదు అనేది అందరికీ అర్థం అయిపోయింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాపై అప్పట్లో అంచనాలు భారీగా ఉండేవి, కానీ ఎప్పుడైతే టీజర్ విడుదల అయ్యిందో అప్పటి నుండి ఈ చిత్రం పై ఎవ్వరూ ఊహించని రేంజ్ లో నెగటివిటీ ఏర్పడింది. టీజర్ పై వచ్చిన ఈ ట్రోల్స్ గురించి కూడా డైరెక్టర్ వశిష్ట సమాధానం చెప్పాడు. ఆయన మాట్లాడుతూ ‘టీజర్ లో VFX క్వాలిటీ అనుకున్న రేంజ్ లో రాలేదనే విషయాన్ని నేను ఒప్పుకుంటాను. కానీ సోషల్ మీడియా లో అంత నెగటివిటీ క్రియేట్ చేసే రేంజ్ క్వాలిటీ లో అయితే లేదు. కావాలని ఒక గ్రూప్ టార్గెట్ చేసి మరీ ఈ చిత్రం పై నెగటివిటీ ని తీసుకొచ్చారు, ఎందుకో తెలియదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: కూలీ’ లో నటించిన నటీనటుల పారితోషికాలు ఇవే..నాగార్జున కి జాక్పాట్!
టీజర్ థియేటర్ లో చూసినవారి నుండి ఎలాంటి కంప్లైంట్ రాలేదని, కానీ ఫోన్ లో, టీవీ లో చూసిన ఆడియన్స్ నుండి మాత్రం కంప్లైంట్స్ వచ్చాయని, కలర్ గ్రేడింగ్ కూడా సిల్వర్ స్క్రీన్ స్క్రీన్ పైన వచ్చినప్పుడు,ఫోన్ లో చూసినప్పుడు చాలా తేడాలు గమనించాను. అందుకే ఈసారి VFX విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము అంటూ చెప్పుకొచ్చాడు వశిష్ట. 14 లోకాలను దాటుకొని హీరో సత్య లోకానికి వెళ్లి హీరోయిన్ ని ఎలా తీసుకొచ్చాడు అనేదే స్టోరీ అన్ని ఈ ఇంటర్వ్యూ లో రివీల్ చేసాడు డైరెక్టర్. కేవలం ఒక పాట, రెండు రోజుల ప్యాచ్ వర్క్ తప్ప సినిమా షూటింగ్ మొత్తం అయిపోయిందని, ఈ నెల 25 నుండి చిరంజీవి గారు స్పెషల్ సాంగ్ షూటింగ్ లో పాల్గొంటాడని చెప్పుకొచ్చాడు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది.