https://oktelugu.com/

Jr NTR: సిద్దు, విశ్వక్ సేన్, ఎన్టీయార్ ముగ్గురి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదరడానికి కారణం ఏంటో తెలుసా..?

రీసెంట్ గా వచ్చిన 'గామీ ' సినిమాలో వైవిధ్యభరితమైన పాత్రను చేసి ఈ సినిమాతో ఒక డీసెంట్ హిట్ ను అందుకోవడమే కాకుండా వైవిద్య భరితమైన పాత్రల్లో కూడా తను నటించగలనని ప్రూవ్ చేసుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : April 11, 2024 / 10:26 AM IST

    Siddhu Vishwak Sen and NTR

    Follow us on

    Jr NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తేజ సజ్జా, విశ్వక్ సేన్, సిద్దు జొన్నల గడ్డ లాంటి యంగ్ హీరోలు తమ తమ సత్తాను చూపించుకుంటూ స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే విశ్వక్ సేన్ మొదటి నుంచి కూడా తను అగ్రేసివ్ గా ఉంటూ డిఫరెంట్ క్యారెక్టర్లను పోషిస్తూ వస్తున్నాడు.

    ఇక రీసెంట్ గా వచ్చిన ‘గామీ ‘ సినిమాలో వైవిధ్యభరితమైన పాత్రను చేసి ఈ సినిమాతో ఒక డీసెంట్ హిట్ ను అందుకోవడమే కాకుండా వైవిద్య భరితమైన పాత్రల్లో కూడా తను నటించగలనని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు కి సీక్వెల్ గా వచ్చిన “టిల్లు స్క్వేర్” సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. అలాగే తేజ “హనుమాన్” సినిమాతో పాన్ ఇండియాలో 400 కోట్ల వసూళ్లను రాబట్టి సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ లాంటి యంగ్ హీరోలతో ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు.

    ఇక దీనికి గల కారణం ఏంటి అనే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. అయితే వీళ్ళిద్దరు ఎన్టీఆర్ కి బాగా కనెక్ట్ అవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే వీళ్లిద్దరికి కూడా సినిమా అంటే విపరీతమైన పిచ్చి ఉండటమే దానికి ముఖ్య కారణమట.. నిజానికి ఎన్టీఆర్ కి సినిమా పిచ్చోళ్ళు కనిపిస్తే చాలు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి వాళ్ళని తనతో కలుపుకొని సినిమా గురించి మాట్లాడుకోవడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు.

    ఇక ఈ క్రమంలోనే వీళ్ళు కలిసినపుడు వీళ్ళతో కూడా అదే తరహా సంభాషణని కొనసాగిస్తూ ఉంటాడట. ఇలా సినిమాల వల్లే ఎన్టీయార్ తెలియకుండానే వీళ్ళతో చాలా క్లోజ్ అయిపోయాడట. ఇక ఈ ముగ్గురిలో ఉన్న కామన్ పాయింట్ వల్లే వీళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారని వీళ్ల సన్నిహితులు చెబుతున్నారు…