Allu Arjun: ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అట్లీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. ‘పుష్ప 2’ సినిమాతో ఎలాంటి గుర్తింపైతే సంపాదించుకున్నాడో ఇప్పుడు అంతకు మించిన గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. అందుకే 700 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొలగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా అల్లు అర్జున్ చేసిన సినిమాలకు ఇండియాలో మంచి గుర్తింపైతే వస్తోంది. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకు తగ్గట్టుగానే సక్సెస్ లను కూడా సాధిస్తూ ఉండడం విశేషం…ఇక అట్లీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా ఆల్రెడీ మూడు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసిన అల్లు అర్జున్ తొందరలోనే ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు.
అయితే ఈ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేయబోతున్నాడు అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే అతని కోసం చాలామంది డైరెక్టర్స్ కథలైతే వినిపించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ, లోకేష్ కనక రాజ్ లాంటి డైరెక్టర్స్ కథలు చెప్పినప్పటికి అల్లు అర్జున్ మాత్రం సందీప్ రెడ్డి వంగ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. వీళ్ల కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్నట్టు గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి.
ఇక దానికి తగ్గట్టుగానే సందీప్ సైతం అల్లు అర్జున్ కి ఒక కథనైతే వినిపించారట. ఇక మొత్తానికైతే ఆ కథను విన్న అల్లు అర్జున్ తొందర్లోనే ఈ సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ – సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లోనే సినిమా చేయబోతున్నాడు అనేది కన్ఫర్మ్ అయింది. తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు. ప్రస్తుత సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా 2026వ సంవత్సరానికల్లా ఫినిష్ చేసి అల్లు అర్జున్ సినిమా మీద ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే 2027 వ సంవత్సరంలో అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ తెరమీదకి రాబోతోంది… మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుందనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…