Ambati Rambabu: తెలిసి మాట్లాడాలి. తెలియకపోతే మౌనంగా ఉండాలి. తెలియని మాటలను తెలిసినట్టు మాట్లాడితే మాత్రం చిక్కులు తప్పవు. ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు( ambati Rambabu) ఇదే పరిస్థితి ఎదురయింది. తాజాగా ఆయన మంత్రి నారా లోకేష్ పై విమర్శలు చేశారు. తప్పుడు వ్యాఖ్యలు చేశారు. విలేకరుల సమావేశం కావడంతో కొంతమంది ప్రతినిధులు అసలు విషయం చెప్పేసరికి షాక్ తిన్నారు అంబటి. అక్కడితో ఆ విషయాన్ని విడిచి పెడుతున్నట్టు చెప్పి మరో అంశం జోలికి వెళ్లారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు అంబటి రాంబాబు పై. అయితే అంబటి రాంబాబు పై సోషల్ మీడియాలో విమర్శలు రావడం సర్వసాధారణం. ఆయన పట్టించుకునే స్థితిలో ఉండడు కూడా. గతంలో చాలా సందర్భాల్లో దీనిని చూశాం కూడా.
* ఎప్పుడు అడ్డగోలుగానే..
అంబటి రాంబాబు మీడియా ముందుకు వస్తే ఎలా మాట్లాడుతారో తెలియంది కాదు. అడ్డదిడ్డంగా మాట్లాడి బుక్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన వల్ల లాభము నష్టము అన్నది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ నాయకత్వం గుర్తించే పరిస్థితిలో కూడా లేదు. ఎందుకంటే అంబటి గతంలో చేసిన చాలా వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంతటి ప్రతికూల ఫలితాలు అంబటి లాంటి నేతల వైఖరి కారణమని విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆయనను దూరం పెట్టడం లేదు. పైగా పార్టీ తరపున స్వేచ్ఛగా మాట్లాడే ఛాయిస్ ఇచ్చారు. అయితే అది మరింత స్వేచ్ఛకు దారితీస్తోంది. అంబటి కామెంట్స్ ఎప్పటికప్పుడు వివాదాలకు దారితీస్తున్నాయి కూడా.
* మాక్ అసెంబ్లీపై కామెంట్స్..
ఇటీవల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ( makk assembly ) నిర్వహించిన సంగతి తెలిసిందే. శాసనసభ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి మాక్ అసెంబ్లీని నిర్వహించారు. అయితే దీనిపై వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. శాసనసభలో స్పీకర్ స్థానంలో విద్యార్థిని కూర్చోబెట్టడం ఏంటని అంబటి ప్రశ్నించారు. ఇంతలో విలేకరులు కొందరు బయటపెట్టారు అన్న విషయం చెప్పడంతో.. ఇంతటితో ఈ అంశాన్ని ఆపేస్తున్నాను అని చెప్పి మరో అంశాన్ని పట్టుకున్నారు అంబటి. అయితే అప్పటికే మంత్రి లోకేష్ పై విమర్శలు చేశారు. విద్యాశాఖ మంత్రి కావడంతో కొంతమంది విద్యార్థులను తయారు చేశారని.. విద్యార్థులతో అటువంటివి చేస్తారా అని ప్రశ్నించారు. రాజ్యాంగ దినోత్సవం నాడు విద్యార్థులకు వ్యవస్థల పట్ల అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులతో పాటు విద్యాధికులు దీనిని ఆహ్వానించారు. అయితే అంబటి రాంబాబు స్టైలే వేరు అన్నట్టు ఉంటుంది కదా.. అదో తప్పుడు వ్యవహారమని అర్థం వచ్చేలా మాట్లాడారు. అడ్డదిడ్డంగా మాట్లాడి అడ్డంగా బుక్కయ్యారు. సోషల్ మీడియాలో నెటిజెన్లు అయితే అంబటి రాంబాబు పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.