Bigg Boss 9 : తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షోస్ లో ఒకటి ‘బిగ్ బాస్'(Bigg Boss). 8 సీజన్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. అన్ని వయస్సులకు సంబంధించిన వాళ్ళు ఈ రియాలిటీ షోని అమితంగా ఇష్టపడి చూస్తుంటారు. కొత్త సంవత్సరం మొదలు పెట్టిందంటే చాలు, ఎప్పుడు ఈ సీజన్ మొదలు అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఈ రియాలిటీ షో ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. కాన్సెప్ట్ కే మన ఆడియన్స్ అడిక్ట్ అయిపోయారు. తెలుగు తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ సీజన్ కి ఇదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. గత సీజన్ కి యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. సీజన్ 7 కి వచ్చిన రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ మాత్రం రాలేదు.
బిగ్ బాస్ టీం చేసిన కొన్ని పొరపాట్లు కారణంగానే అలాంటి ఫలితం వచ్చింది. పచ్చిగా చెప్పాలంటే ప్రస్తుతం వీకెండ్స్ లో ప్రసారం అవుతున్న ‘ఇస్మార్ట్ జోడి 3′(Ismart Jodi 3) లో నిర్వహిస్తున్న రేంజ్ టాస్కులు కూడా లేవు గత సీజన్ లో. అందుకే యావరేజ్ రేంజ్ వద్దే ఆగిపోయింది. కానీ కంటెస్టెంట్స్ కి మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఈ సీజన్ కూడా ఎప్పటి లాగానే సెప్టెంబర్ నెలలో మొదలు కాబోతుందట. సెప్టెంబర్ 6 నుండి ఈ సరికొత్త సీజన్ మొదలు కాబోతున్నట్టు సమాచారం. అయితే గత సీజన్ లో నాగార్జున(Akkineni Nagarjuna) హోస్టింగ్ కి ఆడియన్స్ నుండి తీవ్రమైన నెగటివిటీ ఏర్పడింది. అందుకే ఈ సీజన్ కి హోస్ట్ ని మార్చే ఆలోచనలో కూడా ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. రానా దగ్గుబాటి(Rana Daggubati) లేదా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం.
ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో యాంకర్ వర్షిణి, సీజన్ 8 కంటెస్టెంట్స్ నుండి ఇద్దరినీ, సీజన్ 7 కంటెస్టెంట్స్ నుండి ముగ్గురిని, సీజన్ 6 నుండి ఒకరిని తీసుకోబోతున్నారట. గత సీజన్ లో పాత కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్స్ గా దింపారు, కానీ ఈ సీజన్ లో మాత్రం మొదటి ఎపిసోడ్ నుండే దింపబోతున్నారట. అంతే కాకుండా ప్రస్తుతం నడుస్తున్న ‘ఇస్మార్ట్ జోడి 3’ షోలో అనీల్ గీలా ఒక కంటెస్టెంట్ గా సీజన్ 9(Bigg Boss 9 Telugu) లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయట. అదే విధంగా బిగ్ బాస్ రివ్యూస్ చెప్తూ పాపులారిటీ ని సంపాదించుకొని, బిగ్ బాస్ సీజన్ 6 లో ఒక కంటెస్టెంట్ గా అలరించిన ఆదిరెడ్డి కూడా ఈ సీజన్ లో ఉండబోతున్నట్టు సమాచారం. వీళ్ళు కాకుండా త్వరలోనే స్టార్ మా ఛానల్ లో ‘కిరాక్ లేడీస్..కిలాడీ బాయ్స్’ సీజన్ 2 మొదలు కాబోతుందట. ఈ సీజన్ నుండి కూడా ఇద్దరినీ తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం.