Daaku Maharaaj: సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘డాకు మహారాజ్'(Daaku Maharaj Movie) చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆయన గత చిత్రాలు ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’ లతో పోల్చే రేంజ్ హిట్ కాదు కానీ, అత్యధిక శాతం ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ నెంబర్ ని దాటి 75 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి కదిలే సీజన్. ఆ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తాన్ని విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) చిత్రం లాగేసుకుంది. ఆ ప్రభావం ‘డాకు మహారాజ్’ చిత్రం పై బలంగా పడింది కానీ, ఓవరాల్ గా పర్వాలేదు అనే రేంజ్ లో మాత్రమే ఆడింది. అయితే నిన్న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలు పెట్టింది.
రెస్పాన్స్ ఊహించిన దానికంటే రెండురెట్లు ఎక్కువ వచ్చింది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, ఈ చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ‘పుష్ప 2′(Pushpa 2 Movie) ని కూడా వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానం లో ట్రెండింగ్ అవ్వడమే. కొత్త సినిమాలకు అవన్నీ కామన్ అని మీరు అనుకోవచ్చు. కానీ పుష్ప 2 రీచ్ రేంజ్ వేరు. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాకి ఆడియన్స్ ఉన్నారు, అలాంటి సినిమాని వెనక్కి నెట్టిందంటే ‘డాకు మహారాజ్’ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో చూసిన తర్వాత, అందులోని కొన్ని సన్నివేశాలను నెటిజెన్స్ సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ బాగా వైరల్ చేసారు. ఇంత మంచి సినిమాని ఎందుకు వేరే లెవెల్ కి తీసుకెళ్లలేకపోయారు ఆడియన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనేక సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నవి సమరసింహా రెడ్డి చిత్రంలోని బాలయ్య బాబు ని గుర్తు చేస్తుంది.
ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ఓటీటీ ఆడియన్స్ మెంటలెక్కిపోతున్నారు. ఈ సినిమాని థియేటర్స్ లో చూడని ఆడియన్స్ మాత్రం, అబ్బా మంచి సినిమాని మిస్ అయ్యామే, ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని థియేటర్స్ లో అనుభూతి చెందితేనే కిక్ వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం 24 గంటల్లో దాదాపుగా మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయట. ఒకప్పుడు బాలయ్య సినిమాలకు వారం మొత్తానికి కలిపి ఇన్ని వ్యూస్ వచ్చేవి. ఇప్పుడు మొదటి రోజే వస్తుంది. దీనిని బట్టి ఆయన రేంజ్ ఎలా మారిందో మీరే అర్థం చేస్కోవచ్చు. చూడాలి మరి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ఎన్ని వారాలు నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతుంది అనేది. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య బాబు ‘అఖండ 2’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.