https://oktelugu.com/

NTR – Rajamouli : ఎన్టీఆర్ రాజమౌళి కాంబో లో మరో సినిమా వచ్చే అవకాశం ఉందా..?

ఇక ఇప్పటివరకు ఏ హీరోతో కూడా చేయలేని విధంగా ఎన్టీయార్ తో 4 సినిమాలు చేసి ఎన్టీయార్ కి తనకి మధ్య ఎంత మంచి అనుబంధం ఉందో తెలియజేశాడు...

Written By:
  • NARESH
  • , Updated On : May 23, 2024 / 09:13 PM IST

    NTR Rajamouli

    Follow us on

    NTR – Rajamouli : తెలుగులో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియాలో గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇక పాన్ ఇండియా లో తనకి ఎలాంటి గుర్తింపు అయితే వచ్చిందో పాన్ వరల్డ్ లో కూడా అలాంటి గుర్తింపు కోసమే రాజమౌళి ప్రయత్నం చేస్తున్నాడు.

    ఇక అందుకోసమే ఈ సినిమా లో ఎలాంటి కాంప్రమైజ్ లు లేకుండా చాలా స్ట్రాంగ్ గా స్క్రిప్ట్ రాసుకొని మంచి కథతో సినిమా చేస్తూ ప్రేక్షకులందరిని అలరిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తవ్వగా తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక రాజమౌళి సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ కూడా పెట్టి సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది. హీరో క్యారెక్టరైజేశన్ ఏంటి అనేది తెలియజేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

    ఇక మొత్తానికైతే రాజమౌళి ఈ సినిమాతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటాడు అనేది మాత్రం వాస్తవం…ఇక ఇదిలా ఉంటే రాజమౌళి మొదటి సినిమా అయిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో హీరోగా నటించిన ఎన్టీఆర్ ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా స్టార్ హీరోగా కూడా మారిపోయాడు. ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి మధ్య అప్పటినుంచి మంచి సన్నిహిత్యమైతే ఏర్పడింది.

    ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన నాలుగు సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి అంటు వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ ను వదిలేసే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఆయనతో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఏ హీరోతో కూడా చేయలేని విధంగా ఎన్టీయార్ తో 4 సినిమాలు చేసి ఎన్టీయార్ కి తనకి మధ్య ఎంత మంచి అనుబంధం ఉందో తెలియజేశాడు…