Star Producer introducing Celebrity Kids: సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఘట్టమనేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి సత్తా చాటుతున్నాడు. ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇక అతని తర్వాత తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీలో రాణించడమే కాకుండా పవర్ స్టార్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్నాడు… ఇక తన తర్వాత రామ్ చరణ్, వరుణ్ తేజ్ లాంటి హీరోలు సైతం ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అకిరా నందన్ సైతం హీరోగా రాణించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ ఒకప్పుడు మాస్ హీరోగా అవతరించాడు. తన తర్వాత మహేష్ బాబు సైతం సూపర్ స్టార్ గా అవతరించడమే కాకుండా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
మహేష్ బాబు కొడుకు సైతం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో అటు అఖిరానందన్, ఇటు గౌతమ్ కృష్ణ ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారనే వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ మీదనే అశ్విన్ దత్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇంతకుముందు మహేష్ బాబుని సైతం అశ్వినీ దత్ తన బ్యానర్ మీదనే ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. కాబట్టి గౌతమ్ కృష్ణ సినిమాని సైతం అశ్విని దత్ కి అప్పజెప్పుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మెగా ఫ్యామిలీలోని రామ్ చరణ్ ను సైతం అశ్వినిదత్ తన బ్యానర్ నుంచి ఇంట్రడ్యూస్ చేయాలనే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇప్పుడు అఖిరానందన్, గౌతమ్ కృష్ణ ను సైతం తన బ్యానర్ నుంచే లాంచ్ చేయాలని చూస్తున్నారు.
మొత్తానికైతే వీరిద్దరిని కలిపి మొదటి సినిమాతోనే ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తే బాగుంటుందని అశ్వినీ దత్ భావిస్తున్నారట. ఆయన తీసుకున్న ఈ నిర్ణయానికి ఘట్టమనేని ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ వాళ్లు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఈ సినిమాను డైరెక్షన్ చేసే దర్శకుడు ఎవరు అనే విషయంలోనే ఇంకా క్లారిటి రావడం లేదు…
