https://oktelugu.com/

Pawan Kalyan-Trivikram: పవన్ త్రివిక్రమ్ కాంబో ను కలుపుతున్న స్టార్ ప్రొడ్యూసర్…

Pawan Kalyan-Trivikram: 'హరిహర వీరమల్లు' ఒకటి మాత్రమే ఈ సంవత్సరంలో రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మిగిలిన ఓజి, ఉస్తాద్ సింగ్ రెండు సినిమాలు కూడా 2025 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Written By: , Updated On : July 2, 2024 / 10:40 AM IST
Star producer joining Pawan Trivikram combo

Star producer joining Pawan Trivikram combo

Follow us on

Pawan Kalyan-Trivikram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఇండస్ట్రీ లో ఎంతమంది హీరోలు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆయన ఒక్క సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకొని హీరోలందరికంటే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటాడు. ఇక ఇప్పటికి కూడా తెలుగులో ఏ హీరోకి లేనంత అభిమానులు ఆయనకి ఉన్నారని చెప్పడంలోకి ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన రాజకీయాల పరంగా బిజీగా ఉన్నప్పటికీ అవకాశం దొరికిన ప్రతిసారి సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు.

ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమాని ఇప్పుడు పూర్తి చేయాలనే కాన్సెప్ట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో ‘హరిహర వీరమల్లు’ ఒకటి మాత్రమే ఈ సంవత్సరంలో రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మిగిలిన ఓజి, ఉస్తాద్ సింగ్ రెండు సినిమాలు కూడా 2025 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఈ లెక్కన ఈయన కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నారా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ మరి కొంతమంది చెప్తున్న సమాధానం ప్రకారం పవన్ కళ్యాణ్ సంవత్సరానికి ఒక సినిమా అయినా చేస్తాడు తన అభిమానులను నిరాశపరచకుండా ఉండడానికి ఆయన ఒక సినిమా అయిన చేయాలి అంటూ చాలామంది కోరుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబోలో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి.

అందులో జల్సా, అత్తారింటికి దారేది సూపర్ హిట్ అయినప్పటికీ అజ్ఞాతవాసి సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. ఇక వీళ్ళ కాంబినేషన్ గురించి ప్రతి ఒక్కరికి మంచి అంచనాలైతే ఉన్నాయి. అలాంటి వీళ్ళ కాంబినేషన్ ఒక ఫ్లాప్ తో ముగియడం అనేది మంచి విషయం కాదు. కాబట్టి ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత అయిన టీజీ విశ్వ ప్రసాద్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా చేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ చేసిన బ్రో సినిమాకి ప్రొడ్యూసర్ తనే కావడం వల్ల అతనితో పవన్ కళ్యాణ్ కి మంచి సన్నిహిత్యమైతే ఉంది. ఇంకా ఇప్పుడు ఇదే కాంబినేషన్ ను మరోసారి రిపీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఎంతవరకు పాజిబిలిటీ అవుతుంది అనేది తెలీదు గానీ మొత్తానికికైతే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా చూడడానికి ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…