Homeఎంటర్టైన్మెంట్Heroine: కుర్రకారును షేక్ చేసిన ఈ క్యూట్ హీరోయిన్.. ఇప్పుడెలా మారిందో తెలుసా?

Heroine: కుర్రకారును షేక్ చేసిన ఈ క్యూట్ హీరోయిన్.. ఇప్పుడెలా మారిందో తెలుసా?

Heroine: సినిమాలపై ఉన్న ఆసక్తితో కొందరు నటీమణులు ఏ ఇండస్ట్రీలో అవకాశం వచ్చినా నటించడానికి ముందుకు వస్తారు. ఉదాహరణకు తమిళం, మలయాళం పరిశ్రమకు చెందిన చాలా మంది హీరోయిన్లు తెలుగులోకి వచ్చి స్టార్లుగా మారారు. అలాగే మహారాష్ట్ర చిత్ర రంగానికి చెందిన ఓ ముద్దుగుమ్మ వివిధ భాషల్లో అవకాశాలు తెచ్చుకొని ప్రత్యేక గుర్తింపు పొందింది. అప్పట్లో ఓ మరాఠీ సినిమాలో నటించి ఫేమస్ అయిన ఈమె ఆ తరువాత కన్నడం, హిందీ భాషలకు చెందిన సినిమాల్లో నటించింది. ఆ తరువాత 2022 నుంచి ఇండస్ట్రీకి దూరమైంది. చాన్నాళ్లకు ఇమె లేటేస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రత్యక్షమయ్యాయి. ఈ ముద్దుుగుమ్మ అందాలను చూసి కుర్రకారు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఈమె ఎవరు? ఇప్పుడెలా ఉంది?

2016 సంవత్సరంలో రిలీజ్ అయినా ‘సైరట్’ మూవీ ఒక సంచలనం అనే చెప్పాలి. కుల వివక్షతో పాటు లవ్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ మరాఠీ భాషలో మాత్రమే రిలీజ్ అయింది. కానీ పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు పొందింది. నాగరాజు మంజులే డైరెక్షన్లో వచ్చిన ఇందులో ఆకాష్ థోసర్ హీరోగా నటించారు. ఈయనకు జోడీగా రింకూ రాజ్ గురు నటించారు. ఈ సినిమాలో రింకు రాజ్ గురు చాలా అందంగా కనిపిస్తారు. అంతేకాకుండా తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. సైరట్ చిన్న సినిమా అయినా కథాంశం బాగుండడంతో పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ అయింది.

సైరట్ సినిమాతో ఫేమస్ అయినా రింకు రాజ్ గురు ఆ తరువాత కన్నడ సినిమా ‘మనసు మల్లిగే’ లో అవకాశం తెచ్చుకుంది. భాషతో సంబంధం లేకుండా ఈ మూవీలో నటించిన ఆమెకు మంచి పేరే వచ్చింది. ఆ తరువాత మరోసారి కొన్ని మరాఠీ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ‘ఝండ్’ సినిమాతో హిందీలో అడుగుపెట్టింది. అయితే ఇది వెబ్ సిరీస్ అయినప్పటికీ ఇందులో మోనికా పాత్రలో రింకు చాలా చక్కగా నటించింది. దీంతో ఆమెకు పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్స్ పెరిగిపోయారు.

అయితే 2022లో చివరిగా కొన్ని మరాఠీ సినిమాల్లో నటించిన రింకూ ఆ తరువాత చిత్ర పరిశ్రమలో కనిపించలేదు. కానీ ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ కోసం సెర్చ్ చేయగా ఇటీవల కొన్ని లెటెస్ట్ పిక్స్ ప్రత్యక్షమయ్యాయి. అప్పటికీ, ఇప్పటికీ అమ్మడు అందంలో ఎంతో మార్పు వచ్చింది. చీరకట్టులో ఎంతో అందంగా కనిపిస్తున్న రింకూ రాజ్ గురు ను చూసి కుర్రకారు షాక్ అవుతున్నారు. అప్పటి కంటే ఇప్పుడే ఎంతో అందంగా ఉన్నారంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Bonda Umamaheswara Rao: అంబటి రాంబాబుతో చెట్టాపట్టాల్.. టిడిపి సీనియర్ ఎమ్మెల్యేకు షాక్!

Bonda Umamaheswara Rao: అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రేపిన కలకలం కొత్త మలుపు తిరిగింది. కాపు సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తానని చెప్పడం.. వైయస్సార్ కాంగ్రెస్...

Qualities Women Like In Men: ఈ 7 లక్షణాలు మీలో ఉన్నాయా.. మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టరు..

Qualities Women Like In Men: ఒక వ్యక్తిని మరో వ్యక్తి ఇష్టపడడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఒక పురుషుడిని ఒక మహిళ ఏ విషయంలో ఇష్టపడుతారు? అనే సందేహం ఇప్పటికీ...

Rajinikanth Biopic: వెండితెర పైకి సూపర్ స్టార్ రజినీకాంత్ బయోపిక్.. హీరో ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు..

Rajinikanth Biopic: ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ స్థాయికి ఎదగడం అనేది సాధారమైన విషయం కాదు. కృషి , పట్టుదల ఉంటే ఒక మనిషి ఎంత దూరమైనా...

Nagarjuna: నాగార్జున తో సినిమా చేయాలంటే దర్శకుడికి ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే…

Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. శివ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తర్వాత...

Ram Charan : 2027 లో రామ్ చరణ్ సినిమా లేనట్టే.. అభిమానులకు గుండెలు ఆగిపోయే వార్త..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'పెద్ది' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. #RRR తర్వాత వరుసగా...
Oktelugu Epaper
Exit mobile version