https://oktelugu.com/

Samantha Ruth Prabhu : సమంతకు 25 లక్షలు ఇచ్చాను, నాలుగు నెలలు హోటల్ లో ఉంచాను, స్టార్ ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్

హీరోయిన్ సమంతకు రూ. 25 లక్షలు ఇచ్చానని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రైవసీ కోసం నాలుగు నెలలు హోటల్ లో ఉంచానని అన్నారు. ఇంతకీ సదరు నిర్మాత సమంతకు డబ్బులు ఎందుకు ఇచ్చారు? హోటల్ లో అంత సుదీర్ఘ కాలం ఎందుకు ఉంచారు?

Written By:
  • S Reddy
  • , Updated On : December 5, 2024 / 09:17 PM IST

    Samantha

    Follow us on

    Samantha Ruth Prabhu : కెరీర్ బిగినింగ్ నుండి సమంత వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. సమంత లక్కీ చార్మ్. ఆమె నటించిన మెజారిటీ చిత్రాలు విజయం సాధించాయి. అందుకే సమంత వెనక పడేవారు నిర్మాతలు. అనతికాలంలో సమంత స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకుంది. తెలుగు, తమిళ భాషల్లో బడా స్టార్స్ తో ఆమె జతకట్టారు. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ 2, పుష్ప, సిటాడెల్ ప్రాజెక్ట్స్ తో సమంత నార్త్ లో కూడా ఫేమ్ తెచ్చుకుంది. హిందీ ఆడియన్స్ సైతం ఆమెను ఆదరిస్తున్నారు.

    కాగా ఓ స్టార్ ప్రొడ్యూసర్ సమంతకు గతంలో రూ. 25 లక్షలు ఇచ్చానని వెల్లడించారు. ఆయన ఎవరో కాదు బెల్లంకొండ సురేష్. సాంబయ్య, ఆది, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ వంటి భారీ హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. సురేష్ తన కుమారుడు సాయి శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేశాడు. అల్లుడు శ్రీను మూవీలో సాయి శ్రీనివాస్, సమంత జంటగా నటించారు. 2014లో అల్లుడు శ్రీను విడుదలైంది. అప్పటికే సమంత స్టార్ హీరోయిన్.

    ఈ మూవీ చిత్రీకరణ సమయంలో సమంత చర్మ సంబంధిత రుగ్మతకు గురయ్యారట. ట్రీట్మెంట్ కి అవసరమైన డబ్బులు ఇచ్చేందుకు నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదట. అల్లుడు శీను మూవీ నిర్మాతగా ఉన్న బెల్లంకొండ సురేష్ రూ. 25 లక్షలు సమంతకు ఇచ్చారట. ప్రైవసీ కావాలని నాలుగు నెలలు హోటల్ లో ఉంచారట. సమంతకు ఆ కృతజ్ఞత ఉంది. ఇప్పటికీ నేను చేసిన సాయం ఆమె మర్చిపోలేదని ఆయన అన్నారు.

    సమంత చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. బెల్లంకొండ సురేష్ తాజా కామెంట్స్ తో దీనిపై క్లారిటీ వచ్చింది. డెబ్యూ హీరో అయినప్పటికీ కొడుకు మూవీ కావడంతో బెల్లంకొండ సురేష్ అల్లు శీను సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు. దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో సురేష్ పెట్టుబడి రాబట్టాడు. ఎన్టీఆర్ తో చేసిన రభస డిజాస్టర్ అయ్యింది. ఆ మూవీ మధ్యలో ఆపేద్దాం అంటే.. ఎన్టీఆర్ వినలేదట.