https://oktelugu.com/

Pushpa 2: The Rule : మెగాస్టార్ చిరంజీవిని కలిసి కృతఙ్ఞతలు తెలియచేసిన ‘పుష్ప 2’ మేకర్స్..మెగా ఫ్యాన్స్ కి ఇక పండుగే!

ఈ చిత్రానికి మొదటి రోజు 60 నుండి 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయట. మొదటి రోజు వసూళ్లే ఈ రేంజ్ లో ఉంటే, ఇక ఫుల్ రన్ లో ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో మీరే ఊహించుకోండి.

Written By:
  • NARESH
  • , Updated On : December 5, 2024 / 09:20 PM IST

    'Pushpa 2' producers

    Follow us on

    Pushpa 2: The Rule : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసిన ఈ సినిమా టికెట్స్ కోసం పెద్ద యుద్ధమే నడుస్తుంది. విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ మీద ఏర్పడిన నెగటివిటీ, సినిమా మీద ఎక్కడ ప్రభావం చూపిస్తుందో అని మేకర్స్ కాస్త భయపడిన విషయం వాస్తవమే. కానీ విడుదల తర్వాత సినిమాలోని అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని చూసి ఆయన్ని ద్వేషించే వాళ్ళు కూడా చొక్కాలు చింపుకొని థియేటర్స్ లో డ్యాన్స్ వేసే పరిస్థితి వచ్చింది. ఆ రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ చిత్రం. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ కి థియేటర్ బ్లాస్ట్ అయ్యింది. కేవలం ఈ ఒక్క సన్నివేశం కోసం రెండు మూడు సార్లు థియేటర్ కి వెళ్లి ఈ చిత్రాన్ని చూడొచ్చు.

    ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రాగానే డైరెక్టర్ సుకుమార్ మరియు నిర్మాతలు కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఎందుకంటే సినిమా విడుదలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి అభిమాన సంఘాలు, జనసేన పార్టీ నాయకులూ, ఈ చిత్రానికి పూర్తిగా సహకరించేలా చేసింది మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. అందుకే మేకర్స్ ఆయన్ని కలిసి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలియచేసారు. చిరంజీవి కూడా ఈ సినిమా ఘన విజయం పట్ల మూవీ టీం కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేసి, ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టాలని ఆకాంక్షించారు. అయితే చిరంజీవి ఇంకా ఈ చిత్రాన్ని చూడలేదట. ఈ వీకెండ్ లో ఆయన కుటుంబ సమేతంగా తన నివాసంలోనే స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా చూడబోతున్నట్టు సమాచారం.

    ఇకపోతే పుష్ప 2 చిత్రానికి దేశ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టే రేంజ్ ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఇటీవల కాలం లో ఇలాంటి సెన్సేషనల్ ఓపెనింగ్స్ ఏ చిత్రానికి చూడలేదని మేకర్స్ అంటున్నారు. ఊపుని చూస్తుంటే ఈ సినిమాకి మొదటి రోజే 340 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తుందని, ఈ రికార్డు ని కొడితే మళ్ళీ రాజమౌళి మాత్రమే కొట్టగలడని, ఇంకెవ్వరి వల్ల కాదని అంటున్నారు ట్రేడ్ పండితులు. నార్త్ అమెరికాలో కూడా ఈ చిత్రానికి 3.3 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయట. కేవలం ఓవర్సీస్ నుండే ఈ చిత్రానికి మొదటి రోజు 60 నుండి 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయట. మొదటి రోజు వసూళ్లే ఈ రేంజ్ లో ఉంటే, ఇక ఫుల్ రన్ లో ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో మీరే ఊహించుకోండి.