https://oktelugu.com/

Shriya Saran: రెడ్ చిల్లీ కంటే ఘాటైన సోయగాలు… స్టార్ లేడీ శ్రియ శరన్ దెబ్బకు సోషల్ మీడియా షేక్

చక్కని రూపం, నటన అంతకు మించి అద్భుతమైన డాన్స్ స్కిల్స్ శ్రియను టాప్ పొజిషన్ కి తీసుకెళ్లాయి. రెండు తరాల సూపర్ స్టార్స్ ని కవర్ చేసిన అరుదైన హీరోయిన్స్ లో శ్రియ ఒకరు.

Written By:
  • Shiva
  • , Updated On : August 5, 2023 / 06:23 PM IST

    Shriya Saran

    Follow us on

    Shriya Saran: వస్తూనే సునామీ సృష్టించిన హీరోయిన్ శ్రియ శరన్. సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యాక శ్రియ వెనక్కి తిరిగి చూసుకోలేదు. రెండు దశాబ్దాలుగా నిరవధికంగా ఆమె సినీ జర్నీ సాగుతుంది. 2001లో విడుదలైన ఇష్టం శ్రియ మొదటి సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇష్టం యావరేజ్ రిజల్ట్ ఇచ్చింది. నెక్స్ట్ మూవీతోనే నాగార్జున పక్కన ఛాన్స్ కొట్టేసింది. వీరి కాంబోలో వచ్చిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంతోషం సూపర్ హిట్. ఆ వెంటనే బాలయ్యతో జతకట్టింది. చెన్నకేశవరెడ్డితో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ లో ఆమెకు ఆఫర్స్ వెల్లువెత్తాయి.

    చక్కని రూపం, నటన అంతకు మించి అద్భుతమైన డాన్స్ స్కిల్స్ శ్రియను టాప్ పొజిషన్ కి తీసుకెళ్లాయి. రెండు తరాల సూపర్ స్టార్స్ ని కవర్ చేసిన అరుదైన హీరోయిన్స్ లో శ్రియ ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రజనీకాంత్ లతో పాటు ఎన్టీఆర్, పవన్, మహేష్, ప్రభాస్ లతో ఆమె చిత్రాలు చేశారు. దశాబ్దం పాటు శ్రియ టాప్ హీరోయిన్ గా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది.

    స్టార్ హీరోయిన్ హోదా దూరమయ్యాక శ్రియ ప్రియుడ్ని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లుగా రష్యాకు చెందిన ఆండ్రీతో శ్రియ డేటింగ్ చేస్తుంది. 2018లో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. పెళ్ళైన రెండేళ్లకు 2021లో పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని శ్రియ దాచి పెట్టింది. తర్వాత తనకు పాప ఉన్నట్లు వెల్లడించింది. లాక్ డౌన్ కావడంతో శ్రియ గర్భం దాల్చిన విషయం బయటకు రాలేదు. బాడీ షేమింగ్, ట్రోల్స్ కి భయపడే తల్లైన విషయం దాచినట్లు శ్రియ తెలిపారు.

    శ్రియ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అజయ్ దేవ్ గణ్, ఉపేంద్ర వంటి సీనియర్ హీరోల పక్కన నటిస్తుంది. ఆమెకు ఆఫర్స్ మాత్రం తగ్గడం లేదు. అలాగే మోడలింగ్ చేస్తుంది. నాలుగు పదుల వయసులో కూడా శ్రియ స్లిమ్ అండ్ ఫిట్ బాడీ మైంటైన్ చేస్తుంది. తాజాగా రెడ్ బాడీ కాన్ డ్రెస్ లో గ్లామరస్ ఫోటో షూట్ చేసింది. శ్రియ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ ఆమె అందాన్ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.