Krithi Shetty: కృతి శెట్టికి అర్జెంట్ గా హిట్ కావాలి. ఉప్పెన మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బేబమ్మ జోరు కొనసాగించలేకపోయారు. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ కన్నడ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చాడు. యంగ్ కాలేజ్ గర్ల్ పాత్రకు కృతి శెట్టి సరిపోతుందని భావించాడు. ఆయన ఎంపిక సిల్వర్ స్క్రీన్ పై అద్భుత ఫలితం ఇచ్చింది. ఆ పాత్రకు కృతి శెట్టి చక్కగా సరిపోయింది. వైష్ణవ్ తేజ్-కృతి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కృతి గ్లామర్ హైలెట్ అయ్యింది. కుర్రాళ్ళు కృతి ప్రేమలో పడిపోయారు.
చిన్న సినిమాగా విడుదలైన ఉప్పెన వంద కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. కృతి శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్ సైతం హిట్ కొట్టింది. నానితో అమ్మడు బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించి కాకరేపింది. మూడో ప్రయత్నం బంగార్రాజు కూడా ఫలితం ఇచ్చింది. సంక్రాంతి కానుకగా విడుదలైన సోషియో ఫాంటసీ చిత్రం బంగార్రాజు విజయం సాధించింది. హ్యాట్రిక్ విజయాలతో కృతి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా అవతరించింది.
ఇది ఆమెకు మైనస్ అయ్యింది. అవకాశాలు వస్తున్నాయని ఎడాపెడా సైన్ చేసింది. స్క్రిప్ట్ సెలక్షన్ లో తడబడటంతో వరుస పరాజయాలు పలకరించాయి. రామ్ పోతినేని హీరోగా విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ ది వారియర్ ప్లాప్. ఇక నితిన్ తో చేసిన పొలిటికల్ థ్రిల్లర్ మాచర్ల నియోజకవర్గం మరో ప్లాప్. ఇక సుధీర్ బాబు-మోహన కృష్ణ ఇంద్రగంటి కాంబోలో వచ్చిన అమ్మాయి గురించి మీకు చెప్పాలి డిజాస్టర్. దీంతో కృతి శెట్టి మైండ్ బ్లాక్ అయ్యింది.
నాగ చైతన్య కస్టడీతో కాపాడతాడు అనుకుంటే… ఆయన కూడా హ్యాండ్ ఇచ్చాడు. కస్టడీ నాలుగో ప్లాప్ గా కృతి కెరీర్లో నమోదైంది. టాలీవుడ్ మేకర్స్ కృతి పట్ల ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆమె సోషల్ మీడియాను నమ్ముకున్నారు. గ్లామరస్ రోల్స్ కి సిద్దమే అంటూ హింట్ ఇస్తుంది. ఘాటైన ఫోటో షూట్స్ చేస్తూ సందేశం పంపుతుంది. సిల్వర్ స్క్రీన్ పై హోమ్లీ రోల్స్ చేసిన కృతి ఇంస్టాగ్రామ్ లో మాత్రం రెచ్చిపోతుంది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.