Successors in Film Industry: సినిమా పరిశ్రమలో వారసులు తమ సత్తా చాటుతూనే ఉన్నారు. అప్పటి ఎన్టీఆర్ నుంచి ఇప్పటి తరం వరకు తమ వారసులు విజయపథంలో దూసుకుపోతున్నారు. ఫాదర్స్ డే పురస్కరించుకుని సినిమా పరిశ్రమలో ఉన్న వారందరిని ఒకసారి పరిశీలిస్తే ఎందరో తమ తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన నటనను ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ వారసుడిగా వచ్చిన బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వర్ రావు వారసుడిగా నాగార్జున ఆయన కొడుకుగా నాగచైతన్య, అఖిల్ లు రాణిస్తూనే ఉన్నారు. తండ్రుల తరువాత తరానికి వారు తమ పేరు చాటుతున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేశ్ బాబు గతంలో బాల నటుడిగా నటించారు కొడుకు దిద్దిన కాపురంలో ఆయన ఉన్నట్లు తెలిసిందే. అలాగే ఇప్పుడు మహేశ్ బాబు కుమారుడు కూడా బాలనటుడిగా 1 సినిమాలో నటించాడు. ఇలా వారసులు సినిమా రంగంలో వస్తున్నట్లు తెలుస్తోంది. అలనాటి నటుల నుంచి నేటి తరం వరకు కూడా తమ కొడుకులను వారసులుగా తీసుకొస్తూ సినిమా ప్రపంచాన్ని ఏలుతున్నారు.ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ, ఆయన వారసుడిగా మోక్షజ్ఝ వస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Adivi Sesh: ప్రేమించిన అమ్మాయి అలా చేసింది… పెళ్లిపై దృష్టి పెట్టలేను
ఇక చిరంజీవి వారసులుగా నాగబాబు, పవన్ కల్యాణ్ రాంచరణ్ ఉన్నట్లు తెలిసిందే. ఇక నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ కూడా సినిమాల్లో హీరోగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక వెంకటేశ్ కూడా రామానాయుడు వారసుడిగా వచ్చారు. రామానాయుడు కొడుకులుగా సురేష్ బాబు నిర్మాతగా వెంకటేశ్ హీరోగా వెలుగుతున్నాడు.
ఇంకా సినిమా రంగంలో వారసుల హవా కొనసాగుతూనే ఉంది. నందమూరి హరికృష్ణ తనయులుగా కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఉన్నారు. కల్యాణ్ రామ్ నిర్మాతగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మంచి మార్కులే తెచ్చుకున్నాడు.అతనొక్కడే చిత్రంతో నిర్మాతగా కల్యాణ్ రామ్, జై లవకుశ ద్వారా దూసుకుపోతున్నాడు. నిర్మాతగా రాణిస్తూనే కథానాయకుడిగా ముందుకు వెళ్తున్నాడు.
తండ్రుల వారసులుగా కొడుకులు సినిమాల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా వచ్చిన సాయికుమార్ హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆయన వారసుడిగా ఆది కూడా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇలా చూస్తే సినిమాల్లో వారసుల ప్రభావం అధికంగానే ఉంది. ఫాదర్స్ డే సందర్భంగా కొడుకులు తండ్రులను గౌరవించడం తెలిసిందే.
గతంలో ఉన్న వారి నుంచి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ వరకు వారసుల ప్రస్థానం పెరుగుతోంది. తమ తండ్రుల నుంచి వచ్చిన నటననే తమ వృత్తిగా ఎంచుకుంటూ పరిశ్రమలో నిలదొక్కుకుంటున్నారు. కొన్ని కుటుంబాల నుంచి వచ్చిన వారే మొత్తం సినిమా ఇండస్ర్టీని విస్తరించారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి దాదాపు పది మంది వరకు పరిశ్రమలో ఉన్నారు.అలాగే అక్కినేని కుటుంబం నుంచి కూడా ఐదుగురు వరకు సినిమా రంగాన్ని నమ్ముకున్నారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కూడా ఉన్నారు .
ఇలా వారు తమ అదృష్టాన్ని నమ్ముకుని సినిమాల్లో తమ భవిష్యత్ కు బాటలు వేసుకుంటున్నారు. సినిమాలే ప్రాణంగా ముందుకు వెళ్తున్నారు. ఒక నటననే కాకుండా నిర్మాతలుగా టెక్నిషియన్లుగా ఎందరో తమ వారసత్వాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాల ప్రభావం వారసత్వంపై ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:Megastar Chiranjeevi- Akkineni Akhil: మెగాస్టార్ చిరంజీవి తో యుద్దానికి సిద్దమైన అక్కినేని అఖిల్