Actress Indraja- Roja: జబర్దస్త్ షో ఎంతటి ప్రాచుర్యం పొందిందో తెలిసిందే. కామెడీ షో ద్వారా ప్రేక్షకులు కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే షో ద్వారా జడ్జిలుగా నాగబాబు, రోజా ఇద్దరు ఎంతో పేరు సంపాదించుకున్నాపరిస్థితుల ప్రభావంతో ఇద్దరు షో నుంచి నిష్క్రమించారు. రోజాకు మంత్రి పదవి రాగా నాగబాబు వేరే షోల్లో పాల్గొంటున్నారు. జబర్దస్త్ ప్రస్తుతం కళావిహీనంగా మారింది. దీంతో జబర్దస్త్ కమెడియన్లకు పేరు ప్రఖ్యాతులు సాధించడంలో కీలక వేదికగా మారుతోంది. ఈ నేపథ్యంలో జబర్దస్త్ షో ప్రస్తుతం కామెడీ చేయడంలో ఆపసోపాలు పడుతోందని తెలుస్తోంది. ఆర్టిస్టులు చాలా మంది షో నుంచి వెళ్లిపోవడంతో అసలు కామెడీ పండటం లేదు. ఫలితంగా ప్రేక్షకులకు ఏమాత్రం పసందు కావడం లేదు.
Actress Indraja- Roja
జబర్దస్త్ షో కు ప్రస్తుతం ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తోంది. రోజాకు మంత్రి పదవి రావడంతో ఆమె జబర్దస్త్ ను వీడారు. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో జబర్దస్త్ కు రోజా స్వస్తి పలికి పూర్తిస్థాయిలో రాజకీయాల్లో తిరుగుతున్నారు. దీనిపై జడ్జి ఇంద్రజ ఓ కామెంట్ చేసి వార్తల్లో నిలిచారు. ఇంద్రజ రోజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజాకు మంత్రి పదవి రావద్దని భగవంతుడిని కోరుకున్నానని ఇంద్రజ చెప్పారని కమెడియన్ ఆటో రాంప్రసాద్ చెప్పడంతో అది నిజమే అని ఒప్పుకుంది.
Also Read: Successors in Film Industry: సినిమా పరిశ్రమలో వారసులదే హవా
ఇప్పటికైనా జబర్దస్త్ కు రోజా వస్తే సీటు వదిలేస్తానని చెప్పింది. జబర్దస్త్ షో కు తొమ్మిదేళ్లుగా రోజా అందించిన సేవలు తెలిసిందే. దీంతో జబర్దస్త్ షో ఎంతటి ప్రచారం పొందిందో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు జబర్దస్త్ షో ఎంతో విలువ ఇచ్చింది. ఇదే వేదికపై ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైంది. తరువాత మంత్రిగా కూడా అవకాశం దక్కించుకుంది. దీంతో జబర్దస్త్ వేదిక రోజాకు ఓ స్కూలుగా మారింది. ఆమె భవిష్యత్ కు బంగారు బాటలు వేసింది.
Actress Indraja- Roja
రోజా పై ఇంద్రజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే ఇంద్రజ ఈసారి మాత్రం తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేసి అందరి చేత ఆశ్చర్యం కలిగేలా చేసింది. ఈ క్రమంలో జబర్దస్త్ షో కామెడీ పండించే షోగా ఫోకస్ అయినా రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు ప్రస్తుతం తన కళ తప్పుతోంది. ఇంద్రజ రోజా విషయంలో చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Also Read:Megastar Chiranjeevi- Akkineni Akhil: మెగాస్టార్ చిరంజీవి తో యుద్దానికి సిద్దమైన అక్కినేని అఖిల్