Allu Arjun and Atlee : సోషల్ ఎలిమెంట్స్ తో కమర్షియల్ ఫార్మటు సినిమాలు తీయడం లో ఒకప్పుడు డైరెక్టర్ శంకర్(Shankar Shanmugham) దిట్ట. ఇప్పుడు ఆయన ఫామ్ పూర్తిగా పోయింది, ఆయన స్థానంలోకి అట్లీ(Director Atlee) వచ్చేసాడు. ఈయన కూడా శంకర్ లాగానే సమాజం లో జరిగే బర్నింగ్ అంశాలపై కమర్షియల్ సినిమాలు తీస్తూ ఉంటాడు. ‘రాజా రాణి’, ‘తేరి’, ‘మెర్సల్’, ‘బిజిల్’, ‘జవాన్'(Jawan Movie) వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తో ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడిగా మారిపోయాడు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్(Sharukh Khan) తో తీసిన ‘జవాన్’ చిత్రం ఏకంగా 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) తో ఒక సినిమా చేయబోతున్నాడు. ముందుగా త్రివిక్రమ్(Director Trivikram Srinivas) తో సినిమా చేయాలనీ అల్లు అర్జున్ అనుకున్నప్పటికీ, స్క్రిప్ట్ డెవలప్మెంట్ కి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నందున అట్లీ తో సినిమాని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.
Also Read : అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్న సినిమా రజినీకాంత్ సూపర్ హిట్ సినిమాకి రీమేక్ గా రాబోతోందా..?
కానీ అట్లీ కోరికలు తారాస్థాయిలో ఉన్నాయి. నిర్మాతలను ఆయన ఏకంగా వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అడగడమే కాకుండా, లాభాల్లో వాటాలు కూడా అడుగుతున్నాడట. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ తో పాటు మరో పెద్ద ప్రొడక్షన్ హౌస్ కూడా నిర్మించనుంది. ఈ రెండు ప్రొడక్షన్ హౌసెస్ కూడా అట్లీ డిమాండ్ కి ఒప్పుకోలేదు. హీరో కి 100 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చి, మీకు వంద కోట్లు + లాభాల్లో వాటాలు ఇస్తే, కేవలం మీ ఇద్దరికే 250 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ అయిపోతుంది. ఇక మిగిలిన క్యాస్టింగ్, ప్రొడక్షన్ కాస్ట్ కలిపి 600 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ దాటి పోతుంది. ఈ స్క్రిప్ట్ మీద అంత డబ్బులు వెచ్చించలేమని, ఇది సాధారణ కమర్షియల్ మూవీ అని చెప్పారట. దీంతో అట్లీ కాస్త అసంతృప్తి కి గురైనట్టు సమాచారం.
ఈ విషయాన్ని తెలుసుకున్న నెటిజెన్స్, వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ పాన్ ఇండియన్ హీరోలే పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు, ఇక అట్లీ అంతటి రెమ్యూనరేషన్ ని ఎలా ఆశిస్తాడు?..ఈ దేశంలో వంద కోట్ల రూపాయిల రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకునేంత సత్తా కేవలం రాజమౌళి కి మాత్రమే ఉందని, వేరే ఏ హీరో కి కూడా అంత రేంజ్ లేదని ట్రేడ్ పండితులు అభిప్రాయం. మరి ఈ అట్లీ తగ్గుతాడా?, లేదా నిర్మాతలు తగ్గి అట్లీ కోరినంత రెమ్యూనరేషన్ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇద్దరు తగ్గకపోతే ఈ ప్రాజెక్ట్ ని ఇక మర్చిపోవడమే అని సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్త. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్ కాకపోతే అల్లు అర్జున్ కొరటాల శివ తో సినిమాని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : రిస్క్ చేసిన అల్లు అర్జున్..అట్లీ సినిమాకి అనిరుద్ ని కాదని కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కి అవకాశం..అతను ఎవరంటే!