https://oktelugu.com/

Star Heroine: ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తోన్న స్టార్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?

సినిమాల్లో తనకు వచ్చిన ఆదాయంతో కొన్ని ప్రొడక్ట్స్ పై ఇన్వెస్ట్ చేశారు. కానీ అవి ఆశించినంత లాభాలు రాకపోగా తీవ్ర నష్టాలు తెచ్చిపెట్టాయి. దీంతో దేవయాని పరిస్థితి దీనంగా మారింది.

Written By:
  • Srinivas
  • , Updated On : October 6, 2023 / 05:01 PM IST

    Star Heroine

    Follow us on

    Star Heroine: పవన్ కల్యాణ్ సినిమాలన్నీ ఎవర్ గ్రీన్ గా నిలుస్తాయి. పవన్ కల్యాణ్ కెరీర్ స్టార్ట్ చేసిన తరువాత వరుస హిట్లు కొట్టాడు. వాటిలో ‘సుస్వాగతం’ ఒకటి. లవ్, ఎమోషనల్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది. అంతేకాకుండా మ్యూజికల్ గా ఆకట్టుకుంది. ఈ మూవీలోని పాటలు ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో వినిపిస్తూ ఉంటాయి. ఇందులో పవన్ కల్యాన్ పక్కన నటించి అలరించింది దేవయాని. ఈ సినిమా తరువాత గుర్తింపు తెచ్చుకున్న దేవయాని ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల్లో కనిపించింది. కానీ ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగోలేందను దేవయాని ఏం చేస్తుందో తెలుసా?

    1995-2000 లకాలంలో టాప్ స్టార్ హీరోయిన్లలో దేవయాని ఒకరు. మహారాష్ట్రలోని బొంబాయి లో 1974 జూన్ 22న ఈమె జన్మించింది. కొంకణీ కుటుంబానికి చెందిన దేవయాని అసలు పేరు సుష్మా. చదువు పూర్తయిన తరువాత దేవయాని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మొట్టమొదటిసారిగా పవన్ కల్యాణ్ తో ‘సుస్వాగతం’లో కనిపించింది. ఆ తరువాత శ్రీమతి వెళ్లొస్తా, మాణిక్యంలల్లో మెరిసింది. అయితే దేవయాని నటించిన ఈ సినిమాల్లో మరో హీరోయిన్ ఉండడం విశేషం. సినిమాల్లో నటిస్తుండగానే డైరెక్టర్ రాజకుమార్ ను ప్రేమించింది. ఆ తరువాత వీళ్లిద్దరు పెద్దలను కాదని 2001లో పెళ్లి చేసుకున్నారు.

    Star Heroine

    పెళ్లయిన తరువాత కొన్నాళ్లపాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న దేవయాని ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. 2004లో మహేష్ బాబు తల్లి పాత్ర కోసం పలువురిని సంప్రదించగా ఎవరూ ఒప్పుకోలేదు. కానీ దేవయాని నటించడానికి ముందుకు వచ్చారు. చిన్న వయసులోనే తల్లి పాత్ర చేయడానికి ఆమె ముందుకు రావడంతో అందరూ ప్రశంసంచారు. కానీ ఆ తరువాత ఆమెకు అవకాశాలు రాలేదు. కానీ తమిళం, మలయాళం,హిందీత పాటు ఒక బెంగాలీసినిమాతో కలిపి మొత్తం 75 సినిమాల్లో నటించింది.

    సినిమాల్లో తనకు వచ్చిన ఆదాయంతో కొన్ని ప్రొడక్ట్స్ పై ఇన్వెస్ట్ చేశారు. కానీ అవి ఆశించినంత లాభాలు రాకపోగా తీవ్ర నష్టాలు తెచ్చిపెట్టాయి. దీంతో దేవయాని పరిస్థితి దీనంగా మారింది. దీంతో జీవనం కొనసాగించడానికి ఆమె టీచర్ గా మారింది. తమిళనాడులోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఇటీవల పాఠశాలలో జరిగిన ఓ ఈవెంట్ లో దేవయాని తన స్కూల్ పిల్లలతో కలిసి ఉన్న ఫొటో బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో దేవయాని పరిస్థితి చూసి జాలిపడుతున్నారు.