https://oktelugu.com/

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమా కి నో చెప్పిన స్టార్ హీరోయిన్…

సినిమా ఇండస్ట్రీ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరికి చాలా కీలకంగా మారింది. సినిమాలో నటించే నటీనటులు సినిమాలను చేసి మంచి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నారు. రోజుకి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికి అందులో కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్ సాధిస్తున్నాయి. మరికొన్ని సినిమాలు మాత్రం ఢీలా పడిపోతున్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : November 21, 2024 / 03:51 PM IST

    Vijay Devarakonda(2)

    Follow us on

    Vijay Devarakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు తమను తాము హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా స్టార్ హీరోలుగా ఎలివేట్ అవుతూ ముందుకు సాగుతున్నారు. విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఆ తర్వాత గీతగోవిందం సినిమాతో కూడా మంచి విజయాన్ని సాధించడంతో తనకు తిరుగులేదని అనుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రమే డిఫరెంట్ పరిస్థితి ఏర్పడుతుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన చేయబోయే సినిమాల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన జర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా రెండు పార్ట్ లుగా రాబోతుందంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా చేసిన 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడం విశేషం…ఇక ఈ సినిమాతో పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి దర్శకుడు గౌతమ్ తిన్ననూరు, హీరో విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా భారీ రేంజ్ లో కసరత్తులైతే చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధిస్తే మాత్రం వాళ్ళు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లోకి వెళ్లిపోతారని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఏది ఏమైనప్పుడు తనకంటూ ఒక సత్తా చాటుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఢీలా పడిపోవడం అనేది ఎవరికి నచ్చడం లేదు.

    ఇక ఇదిలా ఉంటే ఆయన సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించగా ఆమె విజయ్ దేవరకొండ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించనట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆమె వరుస సినిమాలను చేస్తు బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆమె నాగచైతన్యతో కలిసి తండేల్ అనే సినిమా చేస్తుంది.

    అయితే ఈ సినిమాలో తన పాత్ర కీలకంగా ఉండబోతుందట. అందువల్ల తను ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా తన పాత్రకి ప్రాముఖ్యత ఉంటేనే ఆమె ఆ సినిమా చేస్తుంది. లేకపోతే మాత్రం సినిమా చేయడానికి ఇష్టపడదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఉన్న సిచువేషన్స్ ను బట్టి చూస్తే ఆమె విజయ్ దేవరకొండ సినిమాలో నటించే అవకాశాలు లేవని కరాకండగా చెప్పేస్తున్నారు.

    మరి ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఏమైనా నటించే అవకాశాలు ఉన్నాయా అనే విషయం పక్కన పెడితే మాత్రం విజయ్ దేవరకొండ తో నటించడానికి తను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…