https://oktelugu.com/

Vishwak Sen: విశ్వక్ సేన్ అలాంటి స్పీచ్ ఇవ్వకపోతే ఆయన సినిమాలు ఆడవా..? స్టేజ్ ఎక్కితే చాలు ఆయన అలా ఎందుకు మాట్లాడుతాడు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎనలేని గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న హీరోలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలు వాళ్ల సత్తా చాటుకోవడమే లక్ష్యం గా పెట్టుకొని ముందుకు సాగడం విశేషం. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ లాంటి హీరోలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటివరకు వాళ్లకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ఈ స్టార్ హీరోలు తొందర్లోనే భారీ సక్సెస్ లను అందుకోవడానికి సిద్ధమవుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 21, 2024 / 04:03 PM IST

    Vishwak Sen

    Follow us on

    Vishwak Sen: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ముఖ్యంగా విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరో తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికి ఆయన మాత్రం ఆశించిన విజయాలను అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు ‘మెకానిక్ రాఖీ’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమా విషయంలో ఇప్పటికే చాలామంది సినీ సెలెబ్రెటీలతో ప్రమోషన్స్ ను చేస్తూ భారీ ఎత్తున కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో విశ్వాక్ సేన్ చాలా గట్టి నమ్మకంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేశారు. అందులో విశ్వక్ సేన్ మాట్లాడుతూ తన సినిమాలని ఎవరో ఆపాలని చూస్తున్నారని, తను ఎదిగితే చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు అంటూ కొన్ని కామెంట్లైతే చేశాడు. మరి మొత్తానికైతే ఈయన ప్రతి సినిమా రిలీజ్ సమయం లో ఇలాంటి రెచ్చగొట్టే కామెంట్లను చేస్తూ ఉంటాడు.

    దానివల్ల ప్రేక్షకుల్లో ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ బిల్డ్ అయి ఈయన సినిమాలకి భారీ క్రేజ్ రావాలని తద్వారా ప్రేక్షకులు కూడా అతని సినిమాలను చూడాలనే ఉద్దేశ్యంతో ఆయన అలాంటి స్ట్రాటజీ మైన్ టైన్ చేస్తాడు అంటూ కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మెకానిక్ రాఖీ లాంటి సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

    ఇక ఇప్పటికే కాంట్రవర్సియల్ కామెంట్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. తన ప్రతీ సినిమా ఈవెంట్ లో ఏదో ఒక ఇష్యూ తో కాంట్రవర్సీ లో నిలుస్తూ సినిమా మీద హైప్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా విషయంలో కూడా అలాంటి స్ట్రాటజీ ని మెయింటేన్ చేస్తున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే తను ఫ్యూచర్లో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడనేది తెలియాలంటే మాత్రం ‘మెకానిక్ రాఖీ’ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. చూడాలి మరి ఇక మీదట రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు తద్వారా ఇండస్ట్రీలో ఎలాంటి ప్లేస్ ని కైవసం చేసుకుంటాడు అనేది…