Star Heroine: సినిమా అంటే రంగుల ప్రపంచం అనుకుంటారు సినిమాల్లో చేసే వాళ్ళ లైఫ్ చాలా సాఫీగా సాగిపోతుంది. వాళ్ళకి కష్టాలు ఉండవు, వాళ్ల దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి దానికి వాళ్లకు సొల్యూషన్ దొరుకుతుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ దూరపు కొండలు నునుపు అన్నట్టుగా చూసేవాళ్లకు సినిమా వాళ్ళ రాయల్ లైఫ్ మాత్రమే కనిపిస్తుంది. కానీ లోపల వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవిస్తారనేది సామాన్య మానవులకు తెలీదు వాళ్ళకి కష్టాలు రాకుండా ఉండటానికి వాళ్ళు మనుషులకంటే అతీతులేమి కాదు…
వాళ్లు కూడా సామాన్య మానవులే కాబట్టి వాళ్లకు కూడా అందరిలాగే కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి.ఇక సక్సెస్ అయిన వాళ్లు ఇలా ఉంటే ఇండస్ట్రీలో సక్సెస్ అవుదామని వచ్చి ఫెయిల్యూర్ గా మిగిలిపోయి చివరికి కెరియర్ ని డైలామా లో పడేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరికొందరు మాత్రం మొదట్లో సక్సెస్ లను సాధించి ఆ తర్వాత చెడు అలవాట్లకు బానిసలై కెరియర్ ని నాశనం చేసుకున్న వారు కూడా ఉన్నారు.ఇక అలాంటి వాళ్లలో హీరోయిన్ రచన బెనర్జీ ఒకరు.ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి సినిమాలు చేస్తు తెలుగులో మంచి హీరోయిన్ గా సక్సెస్ లను అందుకుంది.
అయినప్పటికీ తన కెరియర్ ఎక్కువ రోజులపాటు సినిమా ఇండస్ట్రీలో కొనసాగలేదు… దానికి కారణం ఆమె రెండు పెళ్లిళ్లు చేసుకుని వాళ్ల నుంచి విడాకులు తీసుకొని మానసికంగా కొంచెం కృంగిపోయింది.ఇక తెలుగులో ఆమె బావగారు బాగున్నారా, సుల్తాన్, కన్యాదానం లాంటి సినిమాల్లో నటించింది.ముఖ్యం గా ఇవివి సత్యనారాయణ గారి సినిమాల్లో ఎక్కువగా నటించేది. అయితే ఒక రోజు ఓ సినిమా షూటింగ్ లో డైరెక్ట్ గా సెట్ లోనే కూర్చొని మందు తాగుతూ ఉంది.దాంతో ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అలా తాగకూడదు అని చెప్పినందుకు ఆమె రచ్చ రచ్చ చేసిందట.ఇక దాంతో అమెని ఆ సినిమాలో నుంచి తీసివేశారు ఇక ఈ విషయం తెలిసిన సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆమెని తీసుకోవడం మానేశారు.ఇక దాంతో ఆమె ఇండస్ట్రీకి దూరమై పోయింది.
ఇలా నటిగా మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ తనకున్న చెడు అలవాట్ల వల్ల తను ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చింది. ఒక రచన అనే కాదు ఇంకా చాలా మంది నటులు కూడా వ్యసనాలకు బానిసగా మారి కెరియర్ మీద ఫోకస్ పెట్టక ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయారు… అయితే ఈమె ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవి బాలయ్య బాబు లాంటి స్టార్ హీరోలతో నటించి కూడా తన కెరీర్ ని కాపాడుకోలేక పోయిందంటూ మరి కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె మానసికంగా డిప్రెషన్ కి వెళ్లడానికి కారణం ఆమె రెండు పెళ్లిళ్లు చేసుకొని ఆ ఇద్దరు భర్తల నుంచి విడాకులు తీసుకోవడమే కారణం అంటూ అప్పట్లో మానసిక నిపుణులు కూడా వాళ్ల పేరెంట్స్ కి తెలియజేసినట్టుగా తెలుస్తుంది…