https://oktelugu.com/

Shruti Haasan- Dhanush: శృతి హాసన్ ,ధనుష్ ప్రేమ కి అడ్డంకి గా మారింది ఎవరు..?

శృతిహాసన్ ధనుష్ ప్రేమకి ఐశ్వర్య విలన్ గా మారిందంటూ ధనుష్ పలువురు దగ్గర చెప్పినట్టు గా అప్పట్లో కోలీవుడ్ మీడియా వార్తలను ప్రచురించింది.ఇక దాంతో ధనుష్ చేసేదేం లేక శృతిహాసన్ ని వదిలేసి తన సినిమాలు తను చేసుకుంటూ వస్తున్నాడు..

Written By:
  • Gopi
  • , Updated On : November 10, 2023 / 03:50 PM IST

    Shruti Haasan- Dhanush

    Follow us on

    Shruti Haasan- Dhanush: సినిమా ఇండస్ట్రీలో చాలామంది వాళ్లకంటూ ప్రత్యేక గుర్తింపు ను ఏర్పాటు చేసుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతూ వరుసగా సినిమాలు చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో ధనుష్ తనదైన ప్రతిభ ని చాటుకుంటూ సినిమాల్లో వరుసగా హిట్లు సాధిస్తున్నాడు. ఇక ఆయన తెలుగు, హిందీ,తమిళ్ భాషలలో చాలా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.అయితే త్రీ సినిమా చేసే టైంలో ధనుష్ కి , శృతి హాసన్ కి మధ్య ప్రేమ అనేది చిగురించినట్టుగా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.

    ఇంకా చాలా రోజులపాటు వీళ్ళ ప్రేమయానం కూడా నడిచినట్టుగా అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి. అయితే ధనుష్ భార్య అయిన ఐశ్వర్య త్రి సినిమాకి డైరెక్టర్ కావడంతో వీళ్ళ మధ్య కొన్ని క్లోజ్ గా ఉండే సీన్లు గానీ, రొమాంటిక్ సీన్స్ గాని తెరకెక్కించే టైం లో వాళ్ళిద్దరూ ప్రేమలో పడినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరి ప్రేమ కి ఐశ్వర్య అడ్డుపడినట్టుగా అప్పట్లో వార్తలు హాట్ టాపిక్ గా నిలిచాయి. ఇక ధనుష్ మాత్రం శృతిహాసన్ ని వదిలి ఉండలేను అన్నం తగా ఐశ్వర్యతో మాట్లాడినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఐశ్వర్య మాత్రం శృతిహాసన్ కి వార్నింగ్ ఇచ్చి ధనుష్ జోలికి రాకుండా చేసిందంట. అందుకే అప్పటినుంచి ధనుష్ శృతిహాసన్ కాంబినేషన్ లో పెద్దగా సినిమాలు రాలేదు.

    దాంతో శృతిహాసన్ ధనుష్ ప్రేమకి ఐశ్వర్య విలన్ గా మారిందంటూ ధనుష్ పలువురు దగ్గర చెప్పినట్టు గా అప్పట్లో కోలీవుడ్ మీడియా వార్తలను ప్రచురించింది.ఇక దాంతో ధనుష్ చేసేదేం లేక శృతిహాసన్ ని వదిలేసి తన సినిమాలు తను చేసుకుంటూ వస్తున్నాడు… ఇక ప్రస్తుతం ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించిన వర్క్ జరుగుతుంది.ఇక ఈ సినిమా ధనుష్ కెరియర్ లో డైరెక్ట్ గా తెలుగులో తెరకెక్కుతున్న మొదటి సినిమాగా గుర్తింపు పొందుతోంది… ఇక ఇలాంటి క్రమంలో ధనుష్ పాన్ ఇండియా సినిమాలను కూడా చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నాడు….

    ఒక విధంగా చెప్పాలంటే ధనుష్ ఇప్పటికి కూడా శృతిహాసన్ ని ప్రేమిస్తున్నాడు అంటూ కోలీవుడ్ లో చాలా కథనాలు వస్తున్నాయి. అందులో ఎంత మాత్రం నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక శృతి హాసన్ కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం సలార్ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా నటిస్తుంది…