https://oktelugu.com/

Thirsha : ‘పోకిరి’ సినిమాలో హీరోయిన్ రోల్ ని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఆమేనా?..నమ్రతనే ఆమెని తప్పించిందా!

మహేష్ బాబు కి మాత్రమే కాదు, పూరి జగన్నాథ్ కి, హీరోయిన్ ఇలియానా కి కూడా ఈ సినిమా మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ రోల్ కోసం ముందుగా ఇలియానా ని అనుకోలేదట. మహేష్ త్రిష ని తీసుకుందాం అని పూరి జగన్నాథ్ తో అన్నాడట.

Written By:
  • Vicky
  • , Updated On : September 8, 2024 / 09:01 AM IST

    Pokiri Movie

    Follow us on

    Thirsha :  సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో మాత్రమే కాదు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ల్యాండ్ మార్క్ గా నిల్చిన అతి కొద్ది చిత్రాలలో ఒకటి పోకిరి. వరుస ఫ్లాప్స్ లో ఉన్న పూరి జగన్నాథ్ ఎంతో కసితో రాసిన స్క్రిప్ట్ ఇది. అప్పట్లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే కళ్ళు చెదిరే వసూళ్లను రాబడుతూ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఆరోజుల్లోనే ఈ సినిమా దాదాపుగా 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అంటే ఏ స్థాయి సంచలన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా పోకిరి చిత్రానికి ఉన్న క్రేజ్ వేరు. తీస్తే పోకిరి లాంటి సినిమా తియ్యాలి రా, పోకిరి క్లైమాక్స్ లాంటి ట్విస్ట్ కావాలి రా అని అంటూ ఉంటారు. ఆ స్థాయి బెంచ్ మార్క్స్ ని ఈ చిత్రం ఏర్పాటు చేసింది.

    కేవలం మహేష్ బాబు కి మాత్రమే కాదు, పూరి జగన్నాథ్ కి, హీరోయిన్ ఇలియానా కి కూడా ఈ సినిమా మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ రోల్ కోసం ముందుగా ఇలియానా ని అనుకోలేదట. మహేష్ త్రిష ని తీసుకుందాం అని పూరి జగన్నాథ్ తో అన్నాడట. ఈ విషయం నమ్రత దాకా వెళ్ళింది. మొన్ననే కదా ‘అతడు’ లో త్రిష తో కలిసి చేసావ్, మళ్ళీ ఆమెతోనే సినిమా అంటే ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ రాదు, దేవదాసు చిత్రంలో ఎంతో క్యూట్ గా కనిపించిన ఇలియానా ని ఈ సినిమా కోసం తీసుకోండి అని సలహా ఇచ్చిందట. భార్య మాట మహేష్ బాబు జవదాటడు, అందుకే ఆమె చెప్పినట్టుగానే త్రిష ని తప్పించి ఇలియానా ని ఈ సినిమా కోసం తీసుకున్నాడు మహేష్ బాబు. ‘పోకిరి’ చిత్రం పూర్తి అవ్వగానే మళ్ళీ వెంటనే ఆయన త్రిష తో కలిసి ‘సైనికుడు’ చిత్రం చేసాడు. ఇలా అప్పట్లో మహేష్ బాబు త్రిష పై ప్రత్యేక శ్రద్ద చూపడంతో ఆయనపై ఆరోజుల్లో అనేక రూమర్స్ కూడా వినిపించాయి.

    మహేష్ – త్రిష సీక్రెట్ ఎఫైర్ నడుపుతున్నారు అంటూ కొన్ని మీడియా చానెల్స్ పనిగట్టుకొని ఊదరగోట్టాయి. దీంతో అప్పటి నుండి మహేష్ – త్రిష కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. ఇకపోతే త్రిష ప్రముఖ తమిళ సూపర్ స్టార్ ఇలయథలపతి విజయ్ తో గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతుంది. వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరో విశేషం ఏమిటంటే రీసెంట్ గా విడుదలైన విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రం విడుదలైన థియేటర్స్ లో త్రిష సందడి చేసి హల్చల్ చేసింది. దీంతో వీళ్లిద్దరు త్వరలో ఒక్కటి కాబోతున్నారు అనే వార్తలకు మరింత బలం చేకూరింది.